Wednesday, July 15, 2026 02:15 AM
Wednesday, July 15, 2026 02:15 AM

థార్ లవర్స్‌ కు షాక్.. ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి..!

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ ధరలను మరోసారి పెంచుతూ వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. ముడిసరుకుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ పేర్కొంది. తాజా సవరణ ప్రకారం థార్‌ లోని వివిధ వేరియంట్లపై గరిష్టంగా రూ. 37,000 వరకు ధరలు పెరిగాయి. ఈ పెరిగిన కొత్త ధరలు జూలై 10, 2026 నుంచే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

Also Read : ఎస్‌యూవీ లవర్స్‌కు పండగే.. నిస్సాన్ కొత్త సంచలనం..!

కేవలం గత ఏడు నెలల వ్యవధిలోనే మహీంద్రా థార్ ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో రూ. 20,000, ఆ తర్వాత ఏప్రిల్‌ లో రూ. 43,000 చొప్పున ధరలను పెంచిన కంపెనీ.. ఇప్పుడు జూలైలో మరోసారి బాదుడుడు ప్రారంభించింది. ఈ తాజా పెంపుతో మహీంద్రా థార్ ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.32 లక్షలకు చేరగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 17.99 లక్షల మార్కును తాకింది. ఈ తాజా ధరల పెరుగుదల థార్‌లోని అన్ని పెట్రోల్, డీజిల్, మరియు 2WD, 4WD ఆప్షన్ల వేరియంట్లకు వర్తిస్తుంది.

Also Read : టీవీఎస్ అపాచే సరికొత్త రికార్డు.. పిచ్చ క్రేజ్..!

ఇందులో అత్యధికంగా టాప్-స్పెక్ ఎల్‌ఎక్స్‌టీ 4WD 2.2 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ పై రూ. 37,000 భారం పడగా, ఎల్‌ఎక్స్‌టీ 4WD పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ పై రూ. 36,000 మేర ధర పెరిగింది. అలాగే బేస్ మోడల్ ధర రూ. 32,500 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. థార్‌ తో పాటు మహీంద్రాకు చెందిన థార్ రాక్స్, ఎక్స్‌యూవీ 3XO వంటి ఇతర మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. కాబట్టి ఈ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు డీలర్ వద్ద ఆన్-రోడ్ ధరను సరిచూసుకోవడం మంచిది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్...

గత ఆరేళ్లుగా తెలంగాణ రాజకీయ, అధికార...

చంద్రబాబుకు ఉన్న నీటి...

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్...

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

పోల్స్