Saturday, July 11, 2026 06:26 PM
Saturday, July 11, 2026 06:26 PM

వేల కోట్ల వారసుడు అయినా హిట్ కొట్టాల్సిందే..!

డబ్బుంది కదా.. బ్యాక్‌ గ్రౌండ్ ఉంది కదా.. వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చేయొచ్చు. కానీ, థియేటర్లలో జనాల చప్పట్లు కొట్టించాలంటే మాత్రం టాలెంట్, సరైన సక్సెస్ ఉండాల్సిందే. తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న బలమైన ఒపీనియన్ ఇది. అక్కినేని వారసుడిగా వేల కోట్ల ఆస్తి, అండగా పెద్ద సామ్రాజ్యం ఉన్నా.. అఖిల్ అక్కినేని గత పదేళ్లుగా ఒకే ఒక్క పక్కా కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశాడు. ఎట్టకేలకు అతను నటించిన తాజా చిత్రం లెనిన్ థియేటర్లలో పాజిటివ్ టాక్‌ తో దూసుకుపోతుండటంతో అటు అభిమానులు, ఇటు పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

Also Read : ఆ ముగ్గురి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..!

2015లో భారీ అంచనాలతో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలు అతనిలోని కష్టాన్ని నిరూపించాయే తప్ప.. స్టార్ డమ్‌ ను పటిష్టం చేసే రేంజ్ బ్లాక్‌ బస్టర్‌ ను అందించలేకపోయాయి. వేల కోట్ల ఆస్తి ఉన్నా, నాగార్జున లాంటి స్టార్ తండ్రి అండగా నిలిచినా.. అఖిల్ పడిన మానసిక ఘర్షణ, నిరాశ అంతా ఇంతా కాదు. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత కూడా పట్టుదలతో కష్టపడటం అఖిల్ లోని బెస్ట్ క్వాలిటీ అని చెప్పాలి.

Also Read : కఫ్ సిరప్‌లపై కేంద్రం ఉక్కుపాదం..!

దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన లెనిన్ చిత్రం అఖిల్‌ కు పక్కా మాస్ రూస్టర్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. చిత్తూరు యాసలో అఖిల్ పలికిన డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, అఖిల్ థియేటర్ వద్ద తన తండ్రి నాగార్జున కాళ్లు మొక్కి ఎమోషనల్‌ గా కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఇండస్ట్రీలో నెపోటిజం, వారసత్వం గురించి ఎంత మాట్లాడినా.. సక్సెస్ అనేది స్వయంగా సంపాదించుకోవాల్సిందేనని, పదేళ్ల ఓపికకు అఖిల్‌ కు దక్కిన సరైన బహుమతి ఈ లెనిన్ అని కొనియాడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

పోల్స్