Tuesday, August 25, 2026 06:53 AM
Tuesday, August 25, 2026 06:53 AM

ఫౌజీ సెట్ లో అసలేం జరిగింది..?

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ఫౌజీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. అయితే, షూటింగ్ విరామ సమయంలో సెట్‌లో ఒక కలకలం రేగింది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు రాజేష్ శర్మ షూటింగ్ ముగించుకుని దట్టమైన చెట్ల పొదలున్న ప్రాంతంలో స్థానిక టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా ఒక విషపురుగు కాటేసిందట. పురుగు కుట్టిన తర్వాత.. రాజేష్ శర్మ దానిని పెద్దగా పట్టించుకోలేదు.

Also Read : ఆసక్తి రేపుతోన్న జనసేన మీటింగ్.. ఏం జరగబోతోంది..?

ఒక సాధారణ కీటకం అనుకుని లైట్ తీసుకున్నారట. చివరకు.. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. రాజేష్ శర్మ అప్రమత్తమయ్యారు. దాదాపు ఆరు గంటల తర్వాత ఆయన కుడికాలి భాగంలో విపరీతమైన నొప్పి, వాపు మొదలయ్యాయి. అంతటితో ఆగకుండా తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి కోల్‌కతా కు ప్రయాణమయ్యారు. కోల్‌కతా చేరుకున్న వెంటనే రాజేష్ శర్మను ఢాకూరియాలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Also Read : సంజు కోసం లాంగ్ టర్మ్ ప్లాన్..?

కాలి భాగంలో ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుండటం, అలాగే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండటంతో వైద్యులు ఆయనను తక్షణమే ఐసీయూకు మార్చారు. అయితే.. నటి సుదీప ఛటర్జీ సాషల్ మీడియా వేదికగా ఆయన హెల్త్ అప్డేట్ బయటపెట్టారు. రాజేష్ శర్మ ఇంకా పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడలేదని, అభిమానుల ప్రార్థనలు అవసరమని పేర్కొన్నారు. ఈ వార్త తెలియగానే టాలీవుడ్, బాలీవుడ్ సహా బెంగాలీ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ సెట్లలో నటీనటులు, టెక్నీషియన్ల భద్రత మరియు తక్షణ వైద్య సదుపాయాలపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్