Saturday, July 4, 2026 10:16 PM
Saturday, July 4, 2026 10:16 PM

కేతన్ కేసు తేలదా..? ఆధారాలు ఎక్కడ..?

మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. లోనావాలా సమీపంలో కేతన్ మృతదేహం లభ్యమైన నాటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు శరవేగంగా విచారణ జరిపారు. తాజాగా నిందితులు ఇద్దరికీ న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించి జైలుకు తరలించింది.

Also Read : రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

అయితే ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా బలమైన ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఇంకా లభించలేదనే ప్రచారం సాగుతుండటంతో అసలు ఈ మిస్టరీ తేలుతుందా లేదా అనే సరికొత్త చర్చ నడుస్తోంది. ఈ హత్య వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టేందుకు నిందితులకు నార్కో అనాలసిస్, పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే, నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ ఈ పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించడం సంచలనంగా మారింది.

Also Read : కవిత కొత్త పార్టీకి ఈసీ షాక్..!

భారత చట్టాల ప్రకారం నిందితుల సమ్మతి లేకుండా వారిపై ఇలాంటి పరీక్షలు బలవంతంగా నిర్వహించడానికి వీల్లేదు. నిందితులు కోర్టు సమక్షంలోనే తమ అసమ్మతిని తెలపడంతో, న్యాయస్థానం పోలీసుల వినతిని తిరస్కరించింది. ఇప్పుడు సైంటిఫిక్ పరీక్షలకు కూడా నిందితులు సహకరించకపోవడంతో పోలీసులు పూర్తిగా సర్కమ్‌ స్టాంటియల్ ఎవిడెన్స్, కాల్ డేటాపైనే ఆధారపడవలసి వస్తోంది. దీనితో కేసు విచారణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన...

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

పోల్స్