దక్షిణ భారతదేశంలో ప్రతిష్టాత్మక బులెట్ ట్రైన్ నెట్ వర్క్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదిత హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ కు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవున సాగే ఈ కారిడార్ ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుండి కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గిపోనుంది. ఈ బులెట్ ట్రైన్ మార్గంలో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్ గుండానే సాగనుంది.
Also Read : టాటా సియెర్రా ఈవీ రేంజ్ మామూలుగా లేదుగా..!
మొత్తం ట్రాక్ లో ఏపీలో 518.54 కిలోమీటర్లు, తెలంగాణలో 180.32 కిలోమీటర్లు, తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ను నిర్మిస్తారు. ఈ కారిడార్ మొత్తం 18 స్టేషన్లను కలిగి ఉండగా, అందులో ఏపీలోనే అత్యధికంగా 9 స్టాప్ లు ఉన్నాయి. రూట్ మ్యాప్ ఒకసారి చూస్తే.. తెలంగాణలో.. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లేదా నానక్ రామ్ గూడ, శంషాబాద్, భారత్ సిటీ, డ్రై పోర్ట్, హలియా, వాడపల్లి. ఆంధ్రప్రదేశ్ లోని దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి.
Also Read : పవన్ కు సర్జరీ తప్పదు.. షాక్ ఇచ్చిన వైద్యులు..!
తమిళనాడులోని తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్, చెన్నై సెంట్రల్ స్టేషన్. ఈ ప్రాజెక్టుతో పాటు తిరుపతి-చిత్తూరు మధ్య 65 కిలోమీటర్ల ప్రత్యేక లింక్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రాథమిక ఆమోదం లభించింది. దీని కోసం ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసేందుకు NHSRCL అంగీకరించింది. ఈ లింక్ రోడ్డు పూర్తయితే, ప్రతిపాదిత చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ తో ఇది అనుసంధానమవుతుంది. దీనివల్ల బెంగళూరు నుండి తిరుపతి, చిత్తూరు మీదుగా అమరావతికి ప్రయాణించడం ప్రయాణికులకు ఎంతో సులువవుతుంది.

