Tuesday, June 30, 2026 08:01 PM
Tuesday, June 30, 2026 08:01 PM

350 ఎకరాలు స్వాహా.. వైసీపీ ఎమ్మెల్యే కబ్జా కహానీ

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన కబ్జాలు, ఆక్రమణలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధరెడ్డి ఏకంగా 350 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం సంచలనం సృష్టిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. రెవెన్యూ రికార్డులు, వెబ్‌ల్యాండ్‌ డేటాను మార్చేసి.. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసిన వ్యవహారంతో రాజకీయ దుమారం చెలరేగింది. స్థానికుల ఫిర్యాదుతో విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు.. వైసీపీ ఎమ్మెల్యే కబ్జా కహానీ నిజమే అని తేల్చారు.

Also Read : పవన్ కు సర్జరీ తప్పదు.. షాక్ ఇచ్చిన వైద్యులు..!

కడప జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాత అడంగల్‌, డీకేటీ, ప్రొఫార్మా రికార్డుల్లో ఉన్న వివరాలకు, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన పేర్లకు ఏమాత్రం పోలిక లేకపోవడాన్ని గుర్తించారు. వెబ్‌ల్యాండ్‌లో భూమి యజమాని పేరు మారినా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు గానీ, సేల్ డీడ్లు గానీ లేవు. గతంలో పోరంబోకు, అటవీ భూములుగా ఉన్న ల్యాండ్‌.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీదకు మారింది.

పాత అడంగల్‌ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలాన్ని.. ప్రైవేటు వ్యక్తుల అనుభంలో ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇలా మార్చడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. అధికార బలంతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి.. అక్రమంగా మ్యుటేషన్లు చేసినట్లు ఈ వ్యవహారంపై విచారణ చేసిన రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. మొత్తం 350 ఎకరాల్లో చాలా వరకు ప్రభుత్వ భూములు ఉండగా.. నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్‌, చుక్కల భూములను కూడా వైసీపీ ఎమ్మెల్యే కబ్జా చేశారని రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికలో ధృవీకరించారు.

Also Read : 2018 గ్రూప్ వన్ రద్దు హామీ.. గాలిలో దీపమేనా..?

రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తేలడంతో వెంటనే స్పందించిన కడప జిల్లా కలెక్టర్.. ప్రభుత్వ భూములను స్వాదీనం చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆర్డర్‌తో రంగంలోకి దిగిన అధికారులు వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో మార్పులు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఫెన్సింగ్‌లు తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో కడప జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ దోపిడీకి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే అని.. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ప్రతి నియోజకవర్గంలోనూ వేలాది ఎకరాల భూకుంకోణాలు బయటపడతాయని ప్రజలు అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాని అవుట్.. రోహిత్...

ఏపీలో ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం...

సునీల్ కుమార్ రిటైర్మెంట్...

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌ కు చెందిన వివాదాస్పద,...

దువ్వాడ మిస్సింగ్.. దివ్వెల...

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్...

2018 గ్రూప్ వన్...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పులకు...

పవన్ కు సర్జరీ...

ఇటీవలే సర్జరీ చేయించుకుని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న.....

సునీల్ కుమార్ కేసు.....

అధికారి పీవీ సునీల్ కుమార్ తన...

పోల్స్