Sunday, June 28, 2026 11:06 AM
Sunday, June 28, 2026 11:06 AM

కాషాయ పార్టీ స్పెషల్ ఫోకస్.. టార్గెట్ ఫిక్స్..!

దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. ఇందులో భాగంగా దశాబ్ధాల తరబడి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణలో ఆశించిన ఫలితాలు అంతగా రావడంలేదని, ఈసారి తెలంగాణ నుంచే విజయకేతనం ఎగురవేయాలని జాతీయ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. మొదటగా పార్టీకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులున్న జాబితాలో తెలంగాణ నుంచి ఒక ఎంపీని అందించిన చరిత్రను కేంద్ర బీజేపీ నాయకత్వం మరువలేదు. అయితే, రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టడానికి అనువైన సమయం రాలేదని, ఇక జాతీయ పార్టీ దృష్టంతా తెలంగాణపైనే పెడుతున్నట్లు సంకేతాలున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే అండర్ గ్రౌండ్ పనులను చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : అదానిని వెంటాడుతున్న అమెరికా ఫెడరల్ కోర్టు..!

సంస్థాగత బలోపేతం నుంచి అధికార లక్ష్యాల వరకు కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఒక రూట్ మ్యాప్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రూట్ మ్యాప్ ప్రకారం వచ్చే రెండున్నరేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, దానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందించాలనే దానిపై పార్టీ సీనియర్లతో నితిన్ చర్చిస్తారని సమాచారం. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార ప్రత్యామ్నాయంగా నిలపాలన్న లక్ష్యంతో జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన పురోగతి సాధించింది. 8 పార్లమెంట్ సీట్లను గెలిచి తెలంగాణలో సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీని కైవసం చేసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాషాయ పెద్దలు. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించడంపై ఫోకస్ పెట్టారు.

బూత్ లెవల్ కమిటీలతో వరుస భేటీలు, పార్టీ నాయకులు, సంఘ్ పరివార్ నుంచి పని చేసిన వారిని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వడం వంటి పనులకు రాష్ట్ర పార్టీ వేగవంతం చేసింది. ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాల నుంచి పని చేసిన సంఘ్ పరివార్ నాయకులను నితిన్ నబీన్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో ప్రతీ బూత్ స్థాయి కమిటీని బలోపేతం చేయడం, బీజేపీ శక్తి కేంద్రాల బలోపేతం, మండల, జిల్లా కమిటీల పునర్వ్యవస్థీకరణ, యువత, మహిళలు, రైతులు, బీసీలపై ప్రత్యేక దృష్టి, ప్రధానంగా సోషల్ మీడియా, ఐటీ విభాగాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చేందుకు పార్టీ సిద్ధమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో భారీగా ఐటీ ప్రొఫెషనల్స్‌ను పార్టీలో చేర్చుకున్నారు.

Also Read : తెలంగాణా సర్కార్ కు ట్రంప్ థాంక్స్..!

తెలంగాణలో పార్టీకి బలమైన నాయకత్వాన్ని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంపై దీటుగా ప్రశ్నించేతత్వంతో ముందుకు సాగే నేతలు అత్యవసరమని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతమున్న నేతలకు అదనంగా ఘాటైన వాణి వినిపించే నాయకుల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయాన్ని పెంచి ఒకే వ్యూహంతో ముందుకు వెళ్లాలని జాతీయ నాయకత్వం సూచించే అవకాశం ఉంది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ ప్రభావాన్ని పెంచి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన రాజకీయ పునాది ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల ఫలితాలే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తాయని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా యువత, పట్టణ మధ్య తరగతి, బీసీ సామాజిక వర్గాలు, మహిళా ఓటర్లు, మొదటిసారి ఓటు వేసే యువ ఓటర్లను ఆకర్షించే విధంగాప్రణాళికతో ముందుకు సాగడానికి కసరత్తు చేస్తోంది. ఈ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశముంది.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఎలా ఉందనే దానిపై నివేదికలను నాయకుల ముందు పెడుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. బీఆర్ఎస్ అప్పుల కుప్పగా చేసిందనే అపవాదును మూటగట్టుకుంది. ఇలా రెండు పార్టీల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత దూకుడుగా వ్యవహరించాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల అమలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలని నాయకత్వం సూచించే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని పార్టీ భావిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నేతలను తరిమి...

అమరావతి... ఇది కేవలం ఒక ప్రాంతం...

తిరుపతిలో భూమన దారుణాలు.....

తిరుపతి నగరంలో వైసీపీ సీనియర్ నేత,...

ఏపీ పోలీసులపై మానవ...

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ...

తెలంగాణా సర్కార్ కు...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక...

ఏపీ మ్యాప్ తో...

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో...

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

పోల్స్