Wednesday, September 23, 2026 02:37 PM
Wednesday, September 23, 2026 02:37 PM

ఇండియన్స్ కు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..!

అమెరికాలో స్థిరపడాలి అని ఆశ పడుతున్న వారికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత ఏడాది కాలంగా అనేక షాక్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.  పౌరసత్వ దరఖాస్తు రుసుమును దాదాపు 80 శాతం మేర పెంచుతూ కొత్త ప్రతిపాదనలను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రస్తుతం 760 డాలర్లుగా ఉన్న పేపర్ దరఖాస్తు ఫీజు ఏకంగా 1,330 డాలర్లకు పెరగనుంది.

Also Read : బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్‌

ఈ నిర్ణయం వల్ల వలసదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 1,280 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, సిటిజన్‌ షిప్ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, ఆ నిర్ణయంపై అప్పీల్ చేయడానికి వసూలు చేసే రుసుమును కూడా ప్రభుత్వం మరో 645 డాలర్లు అదనంగా పెంచింది. తక్కువ ఆదాయం ఉన్న పేద వలసదారులకు గతంలో అందించిన ఫీజు రాయితీలు, పూర్తి మినహాయింపులను ఈ ప్రతిపాదన ద్వారా పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.

Also Read : బ్రిటన్ ప్రధానులకు శాపం.. పదేళ్ళలో ఆరవ ప్రధాని..!

అమెరికా సైన్యంలో పనిచేసిన మాజీ సైనికులకు మరియు ప్రస్తుతం సేవలందిస్తున్న వారికి మాత్రమే ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ పెంచిన ఫీజుల ప్రతిపాదనలపై 60 రోజుల పాటు ప్రజల నుండి సలహాలు, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అనంతరం ట్రంప్ సర్కార్ తుది నిర్ణయాన్ని అమలు చేయనుంది. అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది వలసదారులపై, ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద వర్గాలపై ఈ నిర్ణయం తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

పోల్స్