Tuesday, June 9, 2026 08:48 PM
Tuesday, June 9, 2026 08:48 PM

స్టీల్ ప్లాంట్.. నిర్లక్ష్యంతో బూడిదవుతున్న కార్మికులు..!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు.. కార్మికుల ప్రాణాలను బూడిద చేస్తున్నాయి. కనీసం శరీరాలు గుర్తు కూడా పట్టలేనంతగా మాడిపోతున్నాయి. వేడి నీళ్లు ఒంటి మీద పడితే చాలు.. ఆ బాధతో విలవిల్లాడి పోతాం. అలాంటిది 1500 నుంచి 1600 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సలసల మరుగుతూ.. కరిగిన స్థితిలోని ద్రవపు ఉక్కు.. లిక్విడ్ స్టీల్ మీద పడితే ఎలా ఉంటుందనే ఊహ కూడా భయం వేస్తుంది. శరీరాలు కాలి బొగ్గులా మారిపోతాయి. గుర్తించడం కూడా దాదాపు అసాధ్యం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన దారుణ ఘటన కూడా అలాంటిదే. గాయపడిన వారి శరీరాలు కమిలిపోయాయి. చర్మం ఊడిపోయింది. నరకయాతన అనుభవిస్తున్నారు.

Also Read : రెండు పదవులు చాలవా.. మరో పదవి కావాలా..!

వరుస ప్రమాదాలు జరుగుతున్నా కూడా.. కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదనేది కార్మిక సంఘాల ఆరోపణ. ప్రమాదం జరిగినప్పుడు ఇలా ఆందోళన చేయడం సహజమే అని అంతా అనుకుంటారు. పని చేసే ప్రదేశంలో మానవ, సాంకేతిక తప్పిదాలు సహజమే అని.. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయనేది కొందరి వాదన. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఇలా ప్రమాదం జరగడం పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్యమనే చెప్పాలి. కన్వర్టర్ నుంచి క్యాస్టింగ్ యూనిట్‌కు ద్రవపు ఉక్కును తరలిస్తున్న లాడిల్‌లో సాంకేతిక సమస్య తలెత్తి భారీ పేలుడు సంభవించడం వల్ల ఈ ఘోర విపత్తు జరిగింది. గతంలో ఏ స్టీల్ ప్లాంట్‌లో కూడా ఇలాంటి ప్రమాదం జరగలేదు.

Also Read : విశాఖ KGHకు లోకేష్‌.. స్టీల్‌ ప్లాంట్ ప్రమాద బాధితులకు భరోసా..!

కఠినమైన ఉక్కు 1500 డిగ్రీల పైగా అధిక ఉష్ణోగ్రతల వద్దే కరుగుతుంది. అంత తీవ్రమైన ద్రవ ఉక్కు ఉన్న చోట ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే.. ఎంతో అనుభవం ఉన్న ఉద్యోగులు, కార్మికులు అక్కడ విధులు నిర్వహించాలి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్లాంట్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గత ఏడాది కాలంగా కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. చిన్న చిన్న ప్రమాదాలకే కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా కూడా.. యాజమాన్యం కనీసం స్పందించ లేదు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా 16 వందల మంది ఉద్యోగులు, కార్మికులు వీఆర్ఎస్ ఇచ్చారు. ఇది యాజమాన్య ఒత్తిడి వల్లే జరిగిందనేది ప్రధాన ఆరోపణ. సాధారణంగా టెలికాం సంస్థలు, రెవెన్యూ సంస్థల్లో వీఆర్ఎస్ ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది రాదు.

Also Read : అలాంటి వారితో బీ కేర్ ఫుల్..!

కానీ రైల్వే, ఉక్కు వంటి పరిశ్రమల్లో వీఆర్ఎస్ ఇవ్వడం చాలా ప్రమాదం. వీఆర్ఎస్ వల్ల స్టీల్ ప్లాంట్‌ పైన పూర్తి అవగాహన ఉన్న ఉద్యోగులు, సీనియర్ కార్మికులు తగ్గిపోయారు. బడ్జెట్ కోతల పేరుతో 20 ఏళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్‌ను తొలగించారు. వీరి స్థానంలో కొత్తగా వచ్చిన వారికి పని మీద అవగాహన లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక మరో కీలక విషయం ఏమిటంటే.. యంత్రాలకు మరమ్మతులు చేయటం లేదు. బండి నడుస్తుంది కదా.. అని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఏదో పై పై మెరుగులు దిద్దుతున్నారు తప్ప.. మెయింటెనెన్స్ పూర్తిగా పక్కన పెట్టారు.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత షరా మామూలే. దీని వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని.. కార్మికులు కాలి బూడిదవ్వడానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఇక వీటితో పాటు నాసి రకం వస్తువులు వినియోగించడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ద్రవ ఉక్కు కరిగించే ముందు అందులో అల్యూమినియం, సిలికా వంటి ఖనిజాలను అందులో కలిపేస్తారు. ఇది కలిపే సమయంలో కెమికల్ రియాక్షన్ జరగటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందంటున్నారు. నాసి రకం వస్తువులతో కార్మికుల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖ KGHకు లోకేష్‌.....

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర...

నా పేరు వాడుకోవద్దు...

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో...

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో...

విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం...

రెండేళ్ల పాలనపై సర్వే.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...

విద్యార్థుల కోసం సర్కార్...

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత...

టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

రాజ్యసభ సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీలో...

పోల్స్