Monday, June 8, 2026 08:21 PM
Monday, June 8, 2026 08:21 PM

సామాన్యుడి కోరిక తీర్చనున్న సీఎం..!

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించారు. ఒక సామాన్య అభిమాని కోరికను తీర్చడానికి ఆయనే ముందుకొచ్చారు. తనను కలవాలని ఆశగా ఎదురుచూస్తున్న ఓ పెద్దాయనను ఉద్దేశించి, “సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం” అని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Also Read : రష్యా హై అలర్ట్ లోనూ.. ఆగని లోకేష్ మిషన్

అసలేం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడితో ఒక యువకుడు మాట్లాడిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో, “చంద్రబాబును ఎప్పుడైనా చూశారా?” అని యువకుడు అడగ్గా, “ఆయన హైదరాబాద్‌లో ఉంటారని అంటారు, నేనైతే చూడలేదు” అని పెద్దాయన అమాయకంగా బదులిచ్చారు. “ఆయన్ను కలవాలని ఉందా?” అని అడగ్గా, సత్యనారాయణ గారు ఎంతో ఉత్సాహంగా, చూడాలనే కోరిక ఉందని చెప్పారు. దీంతో ఆ యువకుడు. ఈ నెల 9న ముఖ్యమంత్రి సిద్ధాంతం వస్తున్నారని, తాను తప్పకుండా కలిసేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట వినగానే సత్యనారాయణ గారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read : పైసాకు పలికే ప్రొఫెసర్ నాగేశ్వర్‌

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడు.. చంద్రబాబు గారు.. ఈ పెద్దాయన కోరిక తీర్చండి సార్.. అని కోరారు. ఈ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన ఆయన, పెద్దాయన కోరికను మన్నిస్తూ తానే స్వయంగా కలుస్తా అంటూ ప్రకటించారు. సిద్ధాంతంలో తన పర్యటన సందర్భంగా సత్యనారాయణను కలవనున్నట్లు చంద్రబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఒక సామాన్యుడి కోరికకు ముఖ్యమంత్రి ఇంత త్వరగా స్పందించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో...

విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం...

రెండేళ్ల పాలనపై సర్వే.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...

విద్యార్థుల కోసం సర్కార్...

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత...

టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

రాజ్యసభ సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీలో...

పైసాకు పలికే ప్రొఫెసర్...

తెలంగాణ సమాజంలో మేధావిగా, విశ్లేషకుడిగా చలామణి...

రష్యా హై అలర్ట్...

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతున్న...

పోల్స్