Monday, June 8, 2026 11:46 PM
Monday, June 8, 2026 11:46 PM

ఈరోజు రాశి ఫలితాలు (08-06-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం.. 08-06-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

—————————————

వృషభం

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

—————————————

మిధునం

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. మిత్రులతో వివాదాల నుండి బయటపడతారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

కర్కాటకం

గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.

—————————————

సింహం

ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

—————————————

కన్య

బంధు మిత్రులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి.

—————————————

తుల

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విలువైన వస్తులాభాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

—————————————

వృశ్చికం

బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు కలుగుతాయి.

—————————————

ధనస్సు

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు క్రమం క్రమంగా ఇబ్బందులు తొలగుతాయి.

—————————————

మకరం

కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

—————————————

కుంభం

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

—————————————

మీనం

ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తులు సలహాలు కొన్ని విషయాలలో కలసి వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

—————————————
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో...

విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం...

రెండేళ్ల పాలనపై సర్వే.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...

విద్యార్థుల కోసం సర్కార్...

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత...

టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

రాజ్యసభ సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీలో...

సామాన్యుడి కోరిక తీర్చనున్న...

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక...

పైసాకు పలికే ప్రొఫెసర్...

తెలంగాణ సమాజంలో మేధావిగా, విశ్లేషకుడిగా చలామణి...

పోల్స్