Wednesday, July 22, 2026 02:28 AM
Wednesday, July 22, 2026 02:28 AM

ఈరోజు రాశి ఫలితాలు (31-05-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 31-05-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

—————————————

వృషభం

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు.

—————————————

మిధునం

ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

—————————————

కర్కాటకం

కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

సింహం

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

—————————————

కన్య

అనుకోని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి.

—————————————

తుల

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

వృశ్చికం

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

—————————————

ధనస్సు

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

—————————————

మకరం

సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

కుంభం

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

—————————————

మీనం

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

————————————-

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్