Friday, September 18, 2026 03:45 AM
Friday, September 18, 2026 03:45 AM

బాలీవుడ్ ను రంగంలోకి దించుతున్న కొరటాల..!

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌ లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రంపై సరికొత్త అప్డేట్స్ ఫిలిం నగర్ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ రాక్‌ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన మార్క్ మ్యూజిక్‌ తో ఇండియన్ సినిమాను ఊపేస్తున్న అనిరుధ్ స్వరం, ఈ సినిమాకు అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్‌ లో కనిపించనున్నారట.

Also Read : చిరంజీవి డిజిటల్ జర్ని స్టార్ట్..!

ఇందుకోసం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ రంగంలోకి దిగారు. బాలకృష్ణ పర్సనాలిటీకి నప్పేలా ఒక స్పెషల్ హెయిర్ స్టైల్, మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌ ను ఆయన డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ మామూలుగా లేదు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ ను ఓ కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also Read : పొడి చర్మం, విరిగే గోళ్లు వేధిస్తున్నాయా..? సంచలన నిజాలు..!

దీనికితోడు ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం మరో భారీ బాలీవుడ్ స్టార్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో ఒక పవర్‌ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. బాలయ్యకు ఢీ కొట్టేలా అనిల్ కపూర్ క్యారెక్టర్‌ ను కొరటాల శివ ఎంతో పవర్‌ ఫుల్‌ గా డిజైన్ చేశారట. బాలీవుడ్ అగ్ర నటుల కలయికతో ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. మరి బాలయ్య-కొరటాల కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్