Saturday, May 23, 2026 06:32 AM
Saturday, May 23, 2026 06:32 AM

ఈరోజు రాశి ఫలితాలు (23-05-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 23-05-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఇతరులతో వివాదాలు రాజి చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

వృషభం

ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

—————————————

మిధునం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

—————————————

కర్కాటకం

ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

—————————————

సింహం

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

—————————————

కన్య

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

—————————————

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

—————————————

వృశ్చికం

స్థిరాస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

—————————————

ధనస్సు

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విషయమైన పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. దైవచింతన పెరుగుతుంది.

—————————————

మకరం

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలుచేస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.

—————————————

కుంభం

బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. నూతన ఋణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమున ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

—————————————

మీనం

ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

చిదంబరం వర్సెస్ లోకేష్.....

నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా,...

ఏపీలో రాజ్యసభ సందడి.....

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ...

షా దృష్టిలో చంద్రబాబు...

సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం...

పోల్స్