Wednesday, May 20, 2026 06:25 PM
Wednesday, May 20, 2026 06:25 PM

పెద్దిలో ఉప్పెనను మించిన షాకింగ్ ట్విస్ట్‌..?

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. కథలో ఉండబోయే ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌ ను కూడా పరోక్షంగా రివీల్ చేసి ఆడియెన్స్‌ ను షాక్‌కు గురిచేస్తోంది. బుచ్చిబాబు తన మొదటి చిత్రం ఉప్పెన క్లైమాక్స్‌ లో ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చినట్లే, ఈ సినిమాలోనూ అంతకంటే బలమైన హార్ట్ బ్రేకింగ్ ఎలిమెంట్ ప్లాన్ చేసినట్లు ఫిలిం నగర్ టాక్.

Also Read : లింక్ డాక్యుమెంట్ల దోపిడీకి సర్కార్ బ్రేక్..!

ఫిలిం సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరో పెద్ది పాత్రకు సంబంధించి ఒక అత్యంత విషాదకరమైన మలుపు ఉండబోతోంది. కథా గమనంలో రామ్ చరణ్ తన రెండు కాళ్లను కోల్పోతాడని తెలుస్తోంది. ట్రైలర్‌ లో ఈ విషయాన్ని ఎక్కడా నేరుగా చూపించనప్పటికీ, చివర్లో వచ్చే ఒక ఇంగ్లీష్ డైలాగ్ దీనికి బలమైన హింట్ ఇస్తోంది. పెద్ది మళ్లీ తన కాళ్లతో వచ్చాడు.. అనే ఆ ఒక్క డైలాగ్ విన్న తర్వాత, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక భారీ ఎమోషనల్ రైడ్ గ్యారెంటీ అనిపిస్తోంది.

Also Read : కేజీఎఫ్, సలార్, డ్రాగన్.. ఒకే ఫార్ములా.. ఒకే లైనప్..!

సాధారణంగా ఒక స్టార్ హీరో నుండి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశిస్తారు, కానీ రామ్ చరణ్ తన ఇమేజ్‌ ను పక్కన పెట్టి, కథను నమ్మి ఇలాంటి సవాలుతో కూడిన పాత్రను అంగీకరించడం విశేషం. గతంలో రంగస్థలంలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుగా మెప్పించిన చరణ్, ఇప్పుడు పెద్దిలో శారీరక వైకల్యాన్ని అధిగమించి విజయం సాధించే ఒక క్రీడాకారుడిగా అంతకంటే బలమైన నటనను చూపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్న బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషనల్ సీన్లను నెక్ట్స్ లెవెల్‌ కు తీసుకెళ్లనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్