Saturday, September 5, 2026 11:40 PM
Saturday, September 5, 2026 11:40 PM

ఎన్టీఆర్ పేరుతో వసూళ్ల దందా.. తారక్ ఆఫీస్ సంచలన లేఖ..!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకుంటూ సోషల్ మీడియాలో భారీ వసూళ్ల మాఫియా సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అభిమాన సంఘాల ముసుగులో కొందరు కేటుగాళ్లు తారక్ ఇమేజ్‌ను వాడుకుంటూ సామాన్య ప్రజలను, అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ అధికారిక కార్యాలయం స్పందిస్తూ ఒక సంచలన లేఖ విడుదల చేసింది. త్వరలో ఎన్టీఆర్ పుట్టినరోజు రానుండటంతో, కొందరు స్థానిక అసోసియేషన్ల లీడర్లు, అనామకులు కలిసి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు.

Also Read : రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ.. ఈసారి కొత్త పేరు..!

ఎన్టీఆరే స్వయంగా వందల కోట్ల బడ్జెట్‌తో ఛారిటీ చేస్తున్నారంటూ నమ్మించి.. గూగుల్ పే, ఫోన్ పే నంబర్లతో విరాళాలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం ఫ్యాన్స్ ద్వారా ఎన్టీఆర్ పర్సనల్ స్టాఫ్ దృష్టికి రావడంతో తారక్ టీమ్ వెంటనే అలర్ట్ అయింది. ఇంత పెద్ద దందా జరుగుతుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా కేవలం లేఖ ఇవ్వడం వెనుక ఎన్టీఆర్ పెద్ద మనసు ఉందని టాక్. కేసు పెడితే అందులో ఉన్నది సొంత అభిమానులే కాబట్టి వాళ్ల జీవితాలు నాశనమవుతాయని తారక్ భావించారట.

Also Read : సీమకు రాయల్ కళ.. పుట్టపర్తిలో AMCA గర్జన..!

తప్పు చేసిన వాళ్లు మారడానికి, అమాయక ప్రజలు అలర్ట్ అవ్వడానికి ఇదొక ముందస్తు హెచ్చరికగా చెప్తున్నారు. “కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ గారి పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు, వీటిని ఆయన ఆమోదించడం లేదు. ఇటువంటి వాటికి విరాళాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలను, శ్రేయోభిలాషులను, అభిమానులను కోరుతున్నాము. ఎటువంటి అధికారిక ప్రకటనలైనా నేరుగా ఎన్టీఆర్ గారి ద్వారా మాత్రమే ప్రకటనలు ఉంటాయని తెలిపింది. ఈ ప్రకటన తర్వాత కూడా ఎవరైనా తారక్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ టీమ్ హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్...

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా...

ఏపీ ఉద్యోగులకు సీఎం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పోల్స్