Saturday, September 26, 2026 01:28 PM
Saturday, September 26, 2026 01:28 PM

రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ.. ఈసారి కొత్త పేరు..!

తెలుగు సినిమా పైరసీ రంగంలో అత్యంత ఆదరణ పొందిన ఐబొమ్మ వెబ్‌ సైట్ మరోసారి కొత్త రూపంలో ఇంటర్నెట్‌ లో ప్రత్యక్షమైంది. గతంలో ఈ సైట్‌ ను యాక్సెస్ చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎన్నిసార్లు నిషేధించినా, బ్లాక్ చేసినా.. డొమైన్ పేర్లు మారుస్తూ మళ్లీ మళ్లీ తెరపైకి రావడం చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి ఈ పైరసీ ముఠా ఐబప్పం అనే సరికొత్త పేరుతో వెబ్‌ సైట్‌ ను ప్రారంభించి రన్ చేస్తోంది.

Also Read : ‘శంబాల’ మ్యాజిక్ రిపీట్ కానుందా..?

తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఐబప్పం సైట్‌ లో థియేటర్లలో మరియు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లలో విడుదలైన సరికొత్త తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు హై క్వాలిటీ ప్రింట్లతో దర్శనమిస్తున్నాయి. అసలు ఐబొమ్మ సైట్‌ ను పూర్తిగా క్లోజ్ చేసేశామని భావిస్తున్న తరుణంలో, ఇలాంటి సరికొత్త క్లోన్ సైట్లు కొత్త సినిమాలతో మళ్లీ ప్రత్యక్షమవ్వడం సోషల్ మీడియాలో మరియు సినిమా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు నైజాం ఎగ్జిబిటర్ల ఊహించని షాక్

ప్రభుత్వాలు ఎంత కఠినమైన నిబంధనలు తెచ్చినా, సైబర్ విభాగాలు నిఘా పెట్టినా ఇలాంటి పైరసీ వెబ్‌సైట్లు వేరే దేశాల సర్వర్ల సాయంతో ప్రాక్సీ లింకుల ద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి అనధికారిక సైట్లను ఓపెన్ చేయడం వల్ల యూజర్ల మొబైల్స్, లాప్టాప్‌ లలోకి ప్రమాదకరమైన మాల్‌ వేర్ వైరస్‌ లు వచ్చే అవకాశం ఉందని, వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

3,677 ఉద్యోగాలు.. మాయమైన...

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC...

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

పోల్స్