Tuesday, September 22, 2026 02:55 PM
Tuesday, September 22, 2026 02:55 PM

ఇద్దరు సీఎంల ముద్దుల ఐఏఎస్ అధికారి..!

అప్పుడు ఆ ఐఏఎస్ అధికారి “పవర్ ” ఎలా వెలిగిపోయిందో.. ఇప్పుడు కూడా రెట్టింపుతోనే వెలిగిపోతుందా అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. సర్వీస్‌లో ఉన్నా.. లేకున్నా ఆ ఐఏఎస్ అధికారి “ప్రభ” పవర్ ఎంతగా వెలిగిపోతుందో..! అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి నచ్చారు.. ఇప్పుడూ కూడా సీఎం చంద్రబాబుకు బాగా నచ్చారంట. ఆ ఐఏఎస్ అధికారి తెలివి తేటలకు “హ్యాట్సఫ్” అంటున్నారు సచివాలయం వర్గాల. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఆ ఐఏఎస్ అధికారి చక్రం తిప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా సీఎం చంద్రబాబు దగ్గర అప్పటి కన్నా రెట్టింపు జోష్‌తో పవర్‌లో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ అధికారిని అందలం ఎక్కించి సీఎం చంద్రబాబు స్వయంగా విమర్శలకు తెర లేపినట్లున్నారు.

Also Read : చిక్కుల్లో పడ్డ స్టార్ స్పిన్నర్..!

సదరు ఐఏఎస్ అధికారి.. అప్పుడు, ఇప్పుడూ కూడా ఆర్ధికంగా వందల కోట్లు వెనకేసుకున్నారన్న ప్రచారంతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఆయన ఎక్కడున్నా సరే.. “విజయం” సాధిస్తూనే ఉంటారు. ఎప్పుడూ అన్ని విధాలుగా “ఆనందం”గానే ఉంటుంటారు.. పవర్ లో ఆయనకున్న అనుభవం మరెవ్వరికీ ఉండదేమో..!. సీఎంలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో బాగా తెలుసు. వారిని ఎలా సంతృప్తి పరచాలో కూడా తెలుసట. మిమ్మల్ని బాగుచేస్తాను.. నేను కూడా బాగుపడతాను అన్నట్లుగా ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవర్తన ఉంటుందనేది సచివాలయంలో చర్చ.

Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. టారిఫ్ లపై కోర్టు కీలక తీర్పు..!

అధికారంలో ఉన్న నేతల బలహీనతలే ఆయనకు బలం అంటున్నారు సన్నిహితులు. పదవి నుంచి రిటైర్డ్ అయినప్పటికీ.. ఇప్పటికీ ఆయన ప్రభావం చంద్రబాబు పైన పని చేస్తుందంటున్నారు. పవర్ ద్వారా వందల కోట్లు ఎలా సంపాదించాలో అనుభవంతో తెలుసు. పవర్‌ను ఎక్కువ కాలం పర్యవేక్షించటమే ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం. జగన్ సన్నిహితుడుగా పేరుతో పాటు, వేల కోట్ల ఆస్తులున్న ఒక బడా కాంట్రాక్టర్‌తో ఈ అధికారికి ఆర్ధిక పరమైన లావాదేవీలు కూడా ఉన్నాయట. అప్పుడు ఆయనకు బాగా ఉపయోగపడ్డారని.. అందుకే ఇప్పటికీ పవర్ ‌లో ఉంటూ పెత్తనం చేస్తున్నారని అంటున్నారు. అప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎంత వరకు నమ్మాలో అంతవరకే నమ్మారు. అంతంత మాత్రమే దగ్గరకు రానిచ్చే వారట. కానీ ఇప్పుడు మాత్రం ఆయనను ఎవరూ ఆపలేని పోస్టులో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం.. సీఎం చంద్రబాబు సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని గుడ్డిగా నమ్ముతున్నారని కొందరు ఐఏఎస్‌లే విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

టీడీపీ కార్యకర్తలకు పవన్...

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

కళ్లెదుటే టీచర్లపై దాడి...

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో...

హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి...

వైసీపీ నేతలపై క్రిమినల్...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ...

పోల్స్