Tuesday, June 23, 2026 03:46 PM
Tuesday, June 23, 2026 03:46 PM

తమిళ పొలిటికల్ థ్రిల్లర్.. ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామి వ్యూహాలు..!

తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో, అధికార పీఠం కోసం పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్నాడీఎంకే ప్రస్తుత ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : మాజీ ఐఏఎస్‌లు ఏమనుకుంటున్నారంటే..?

డీఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీసీకే మరియు వామపక్ష పార్టీలు విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ఇచ్చే విషయంపై తీసుకునే నిర్ణయం ఆధారంగా, పళనిస్వామి తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. మరోవైపు, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి నేడు గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. పుదుచ్చేరి రిసార్ట్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ వెంటనే చెన్నై రావాలని ఆయన ఆదేశించారు.

Also Read : క్రియాటిన్ తో పెరగనున్న బాడీ పవర్.. జిమ్‌ చేసి కష్టపడే వారికి గుడ్ న్యూస్..!

నిన్న రాత్రి ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన పళని, తగిన సంఖ్యాబలం తమకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నారు. ఈ పరిణామాల మధ్య అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “తమిళనాడు ప్రజలు మళ్ళీ అన్నాడీఎంకే పాలనను కోరుకుంటున్నారు. దేవుడి దయతో అతి త్వరలోనే అది జరగవచ్చు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయ్ హెచ్చరికలు, డీఎంకే-అన్నాడీఎంకేల అడుగులు, మరియు వామపక్షాల నిర్ణయం వెలువడితేనే తమిళనాట కొత్త ప్రభుత్వంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

పోల్స్