Tuesday, May 5, 2026 05:27 PM
Tuesday, May 5, 2026 05:27 PM

నిజంగా కేసీఆర్ కు పుడితే.. బండి సంజయ్ సంచలనం..!

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య యుద్ధం ఒకవైపు సాగుతుంటే.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్రమైన భాషలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ విసిరిన సవాళ్లకు ప్రతిసవాల్ విసురుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ లో పర్యటిస్తున్న బండి సంజయ్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పరుష పదజాలం వాడారు.

Also Read : ఆ సీటు త్రిషకా.. తండ్రికా..?

“నువ్వు మనిషి పుట్టుక పుడితే.. కెసిఆర్ కొడుకువే అయితే.. నిజంగా కేసీఆర్ కు పుడితే నా సవాల్ స్వీకరించు” అంటూ అత్యంత వ్యక్తిగత స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ను ఒక ‘వేస్ట్ ఫెలో’ అని సంబోధిస్తూ, అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని బండి ఎద్దేవా చేశారు. ఇటీవల కాలంలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ఫెవికాల్ బంధంతో కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ కేంద్ర మంత్రులు మౌనంగా ఉంటున్నారని, రీవల్ టాక్స్ పేరుతో దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు.

Also Read : బాబు రికార్డు అన్ బ్రేకబుల్..!

ఈ విమర్శలకు కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కారు ఇప్పుడు షెడ్డుకు చేరిందని, కేటీఆర్ కు మెదడులో చిన్నపాటి విజ్ఞానం కూడా లేదంటూ ట్విట్టర్ టిల్లు అని గతంలోనే ఎద్దేవా చేసిన బండి, తాజా వ్యాఖ్యలతో ఆ వేడిని మరింత పెంచారు. నేను ఒక కార్పొరేటర్ లా మాట్లాడుతున్నానని అంటున్నావా..? ఒక కేంద్ర మంత్రిగా నేను ఏం చేశానో కరీంనగర్ గడ్డ మీద నిలబడి చెబుతా.. దమ్ముంటే నువ్వు చర్చకు రా అని బండి సంజయ్ ప్రతిసవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ రాహు-కేతువుల లాంటివారని, వారిద్దరి మధ్య కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

ఆ సీటు త్రిషకా.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘తమిళిగ...

ఏపీకి కేంద్రం గుడ్...

విభజన హామీల అమలు దిశగా అడుగులు...

బాబు రికార్డు అన్...

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి....

టెన్త్ టాపర్లకు విమాన...

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వ...

వారసులు.. వన్ టైమ్...

అవును వాళ్లంతా వారసులు.. ప్రజల్లో తమకంటూ...

పోల్స్