Wednesday, August 5, 2026 03:58 PM
Wednesday, August 5, 2026 03:58 PM

ఎన్టీఆర్-నీల్ మూవీలో హిట్ సెంటిమెంట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్‌ లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హిట్ సెంటిమెంట్ గా పేరున్న సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రాజీవ్ కనకాలే ధృవీకరించడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇటీవల గోదారి గట్టుపై చిత్ర ఈవెంట్‌లో పాల్గొన్న రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read : ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క..!

చాలా కాలం తర్వాత మళ్లీ తారక్‌తో కలిసి పని చేయబోతున్నానని.. మే 7 నుంచి ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటాను అంటూ ప్రకటించాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి, అశోక్, యమదొంగ, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లలో రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించాడు. వీరిద్దరి కాంబినేషన్ ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. మళ్ళీ చాలా కాలం తర్వాత డ్రాగన్ కోసం ఈ హిట్ జోడీ కలుస్తుండటం విశేషం. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది.

Also Read : ముహూర్తం ఖరారు.. మార్పు అప్పుడే..!

ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడం సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ ను పెంచుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక వెయిట్ ఉంటుంది. ఇందులో కూడా రాజీవ్ కనకాల కోసం ఒక ఎమోషనల్, కథను మలుపు తిప్పే బలమైన పాత్రను నీల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్