Tuesday, August 4, 2026 08:34 AM
Tuesday, August 4, 2026 08:34 AM

సాక్షిపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ, ఆ పార్టీ అధికార పత్రిక సాక్షిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు నేడు ఉదయం.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన నేడు సాక్షి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపారు. తాను అనని మాటలను అన్నట్లుగా చూపిస్తూ సాక్షి పత్రిక విషం చిమ్ముతోందని మండిపడ్డారు.

Also Read : పిఠాపురంలో రగులుతున్న కూటమి, వర్మ సంచలన ట్వీట్..!

నా వ్యాఖ్యలను వక్రీకరించి రాస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తప్పుడు వార్తలు రాసినందుకు సాక్షి యాజమాన్యం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించారు. అవినీతి, అక్రమాల పునాదులపై పుట్టుకొచ్చిన సాక్షి ఒక పత్రిక కాదు, అదొక విషపుత్రిక అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read : అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న ఉచ్చు..!

ఆలయాలు, వ్యక్తులపై దాడులు చేయడమే వైసీపీ ప్రధాన అజెండాగా మారిందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ అరాచక విధానాలపైనే నేను వ్యాఖ్యలు చేశానని.. వైసీపీ రౌడీయిజం ఎల్లకాలం సాగదు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ కుల వ్యవస్థను ఉపయోగించుకోలేదని గోరంట్ల స్పష్టం చేశారు. తాను స్వయంకృషితో, వ్యక్తిత్వంతో ఈ స్థాయికి వచ్చానని.. అందరితో సామరస్యంగా ఉండటమే నా నైజం అని స్పష్టం చేసారు. కానీ వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు అని విమర్శించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

పోల్స్