Saturday, April 11, 2026 09:37 PM
Saturday, April 11, 2026 09:37 PM

హైడ్రా కమిషనర్ పగ తీర్చుకుంటున్నారా..?

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పగ తీర్చుకుంటున్నారా..? తనను ఎదిరించిన వారి ఇంటి పైకి బుల్‌డోజర్లు పంపిస్తున్నారా..? తన మాట వినకపోతే ఇళ్లు కూల్చేస్తున్నారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. వాటిని ప్రభుత్వ భూములని అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే ముఖీం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో గతంలో తీవ్రంగా గొడవపడ్డారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మిస్తున్న భారీ భవనాలను కూడా హైడ్రా కూల్చేసింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగనాథ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. పేదల ఇళ్లు మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కూడా. అయితే రంగనాథ్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేశారు.

Also Read : మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలేంటి..?

అయితే తెలంగాణలోని అమీన్‌పూర్‌లో ఈ గతేడాది ఫిబ్రవరి నెలలో జరిగిన హైడ్రా కూల్చివేతల సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను నిలదీశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కూల్చివేతలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆధారాలను కమిషనర్‌కు చూపిస్తూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన 2025 ఫిబ్రవరిలో తీవ్ర చర్చనీయాంశమైంది. భూసేకరణ వివాదంలో రంగనాథ్‌ను న్యాయవాది ముఖీం ప్రశ్నించారు. బాధితుల పక్షాన వాదిస్తూ, కోర్టు పరిధిలో ఉన్న అంశంలోకి ఎందుకు వచ్చారని, పత్రాలను ఎందుకు పరిశీలిస్తున్నారని కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు.

అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్‌లో బాధితులు తమ ప్లాట్ల ఆధారాలను చూపిస్తుండగా, ఈ వాగ్వాదం జరిగింది. కోర్టు పరిధిలో ఉన్న అంశంలోకి జోక్యం చేసుకోవడంపై లాయర్ ముఖీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటన అమీన్‌పూర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు, సర్వేల సందర్భంగా సంచలనం సృష్టించింది. నిజానికి ఆ రోజు కూల్చివేతలు చేపట్టలేదు. ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. సర్వే నెంబర్లు 176, 177లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఐలాపూర్ రాజగోపాల్ నగర్‌కు వచ్చారు. బాధితులతో మాట్లాడుతూ ఉండగా న్యాయవాది ముఖీం అడ్డుకున్నారు. కమిషనర్ రంగనాథ్ తో వాగ్వాదానికి దిగారు.

Also Read : ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలుగు వచ్చా అంటూ రంగనాథ్‌ను ప్రశ్నించారు ముఖీం. కోర్టు పరిధిలో ఉన్న దాన్ని చూసేందుకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. హైడ్రా అంటే గ్రామస్తులు భయపడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చే్శారు ముఖీం. అయితే, తన దగ్గర ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ ముఖీంను హెచ్చరించారు కమిషనర్ రంగనాథ్. అయితే స్థానికులు మాత్రం.. ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 1980లో తాము తీసుకున్న ప్లాట్లను కబ్జా చేశారని.. స్థానికంగా నివాసం ఉంటున్న అడ్వకేట్ ముఖీం.. కొంతమంది ఎస్టీలను ముందు పెట్టి తమ ప్లాట్లను కబ్జా చేశారని ఆరోపించారు. లేఔట్లు కొన్న వారిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద వాళ్లం ఉన్నామని బాధితులు చెప్పారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు వల్లే తాము అమీన్‌పూర్‌లో పర్యటించినట్లు అప్పట్లోనే రంగనాథ్ తెలిపారు. ఫిర్యాదు దారులతో పాటు అడ్వకేట్ ముఖీ కూడా తన వాదనలు వినిపించారన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అప్పట్లో రంగనాథ్‌పై ముఖీం ఘాటు వ్యాఖ్యలు చేయడం.. తీవ్ర ఆరోపణలు చేయడం పెద్ద సంచలనంగా మారింది. కానీ హైడ్రా మాత్రం ఏడాది కాలంగా కేసుపై దర్యాప్తు జరిపింది. అమీన్‌పూర్‌లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించింది. సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం ఇంటిని హైడ్రా కూల్చేసింది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం.. సుప్రీం కోర్టు న్యాయవాది మీద రంగనాథ్ పగ తీర్చుకుంటున్నారని..
గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించాడని రంగనాధ్‌ను ముఖీం నిలదీశారంటున్నారు. ఆ కోపంతోనే నిబంధనలకు వ్యతిరేకంగా ముఖీం నిర్మాణాలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ముఖీం ఇల్లు కూల్చివేత వ్యవహారం ఇప్పుడు రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేసీఆర్ యుద్ధం షురూ.....

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా...

ఆర్టీసీ ఉద్యోగుల కోసం...

ఈ మధ్య కాలంలో గుండెపోటు అనే...

వైసీపీపై షర్మిల విశ్వరూపం.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

దేశ చరిత్రలోనే తొలిసారి.....

భారత ఎన్నికల వ్యవస్థలో విమర్శలకు వేదికగా...

బీ అలర్ట్.. మెయిన్...

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ...

బ్రేకింగ్: సింగర్ మంగ్లీపై...

ప్రముఖ గాయని మంగ్లీ మరో వివాదంలో...

పోల్స్