Friday, October 9, 2026 07:37 AM
Friday, October 9, 2026 07:37 AM

ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన బతుకులు..!

మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో గంటలో గమ్యం చేరనున్న ప్రయాణీకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకునేందుకు వెళ్తున్న వలస కూలీలు మంటల్లో కాలీ బూడిదయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో పది మంది సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా మార్కాపురం – ఒంగోలు రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తెల్లవారుజామున ప్రమాదం జరగటంతో.. ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉన్నారని.. అందుకో మృతుల సంఖ్య భారీగా ఉందని పోలీసులు వెల్లడించారు.

Also Read : ఒకప్పుడు రాజస్థాన్ ప్లేయర్.. ఇప్పుడు ఆర్సీబీ బాస్..!

మార్కాపురం – ఒంగోలు రహదారిపై రాయవరం సమీపంలో పలకల క్వారీ వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల నుంచి మార్కాపురం జిల్లా పామూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మరో గంటలో గమ్యస్థానం చేరనుంది. మాచర్ల, మార్కాపురం, పొదిలి మీదుగా కనిగిరి వెళ్తున్నట్లు ప్రయాణీకులు తెలిపారు. ప్రమాదంలో ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో పనులకు వెళ్లిన వలస కూలీలున్నట్లు సమాచారం. వీరంతా శ్రీరామనవమి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వస్తున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది వరకు ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ముస్తాబైన ఒంటిమిట్ట.. అంగరంగ వైభవం..!

మార్కాపురం మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా మార్కాపురం – ఒంగోలు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాదానికి అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.

మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ – ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్