Wednesday, May 13, 2026 04:47 PM
Wednesday, May 13, 2026 04:47 PM

షుగర్ లెవల్స్ పెరగకుండా కడుపు నిండాలా..? అయితే ఇది తినండి..!

ఈ రోజుల్లో స్నాక్స్ అంటే జంక్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, ఆరోగ్యంతో పాటు కడుపు నింపే అద్భుతమైన చిరుతిండి మఖానా.. అంటారు నిపుణులు. ముఖ్యంగా ఇన్సులిన్ లెవెల్స్ పెరగకుండా, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేయడంలో దీనికి మించిన ఆహారం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మఖానాలో గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే, వీటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక సూపర్ ఫుడ్.

Also Read : అమెరికా గడ్డపై ఇరాన్ దాడి..? అమెరికన్లలో వణుకు మొదలు..!

మఖానాలో పీచు పదార్థం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి, దీనివల్ల మీకు త్వరగా ఆకలి వేయదు. అనవసరమైన స్నాక్స్ తినకుండా కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు మఖానాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మరియు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.

Also Read : డబుల్ చిన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

మఖానాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కొంచెం నెయ్యి లేదా నూనె వేసి, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి చల్లి వేయించుకుని స్నాక్స్‌ లా తీసుకోవచ్చు. మార్కెట్లో దొరికే మసాలా మఖానా ప్యాకెట్లలో సోడియం మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకుని తినడం ఉత్తమం. అర్ధరాత్రి ఆకలి వేసినా లేదా సాయంత్రం టీ టైమ్ స్నాక్స్‌కైనా మఖానా బెస్ట్ ఛాయిస్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పొదుపు మొదలుపెట్టిన మోడీ.....

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ...

అమరావతి, పోలవరం ఆపాలా..?...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా...

రామ్ చరణ్ ‘పెద్ది’...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ఆంధ్ర న్యూస్ 9...

మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో...

అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయికి...

పోల్స్