Sunday, March 22, 2026 02:19 AM
Sunday, March 22, 2026 02:19 AM

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. అసలేం జరుగుతోంది..?

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు గాని పొగరు ఉండకూడదు అనే మాట మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు ఇదే ఓ ఎమ్మెల్యే గారికి సమస్యగా మారింది అనే మాట తెలంగాణా రాజకీయాల్లో వినపడుతోంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు రేగడానికి కారణం ఇదే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంతకాలంగా ఆయన వ్యవహరిస్తున్న శైలి, వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : దురంధర్ 2 పై రాజకీయ రచ్చ..? అసలు వివాదం ఏంటీ..?

నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలువురు ముఖ్య బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలను, ముందు నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ నాశనమే జరుగుతుంది అని కొందరు నేతలు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పాత నేతలను, కార్యకర్తలను కౌశిక్ రెడ్డి పట్టించుకోవడం లేదని, కేవలం తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.

Also Read : గ్రాండ్ గా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌..!

ఇటీవల కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మతపరమైన అంశాలను ప్రస్తావించడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయనే ఆవేదన కూడా వ్యక్తమైంది. అధికారులతో దురుసుగా ప్రవర్తించడం, అధికారిక సమావేశాల్లో గొడవలకు దిగడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తాననడం వంటి వ్యాఖ్యలు కూడా పార్టీలోని కొందరు సీనియర్లకు నచ్చలేదని సమాచారం. నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అసంతృప్త నేతలు తమ గోడును పార్టీ అధిష్టానానికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే తన పంథాను మార్చుకోకపోతే, నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తామని వారు హెచ్చరించడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

ఆస్తుల నిజం జగన్...

గత నాలుగేళ్ల నుంచి వైఎస్ కుటుంబంలో...

పోల్స్