Wednesday, August 5, 2026 12:42 AM
Wednesday, August 5, 2026 12:42 AM

30 ఏళ్ల తర్వాత ఎముకలు, కండరాలు ఎందుకు బలహీనపడతాయి..?

వయసు పెరగడం అనేది సహజమైన ప్రక్రియ. అయితే, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 30 ఏళ్లు దాటిన తర్వాత మానవ శరీరంలో అంతర్గత మార్పులు వేగవంతమవుతాయి. ముఖ్యంగా జీవక్రియ రేటు తగ్గడం, కండరాల సాంద్రత తగ్గడం వంటివి ప్రారంభమవుతాయి. వీటిని సకాలంలో గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. 30 ఏళ్ల తర్వాత మన శరీరం క్యాలరీలను ఖర్చు చేసే వేగం క్రమంగా తగ్గుతుంది. దీనిని ‘మెటబాలిక్ స్లోడౌన్’ అంటారు. ఈ వయసులో ఈస్ట్రోజెన్ (స్త్రీలలో), టెస్టోస్టెరాన్ (పురుషులలో) లెవెల్స్ తగ్గడం వల్ల జీవక్రియ ప్రభావితమవుతుంది.

Also Read : దురంధర్ 2 పై రాజకీయ రచ్చ..? అసలు వివాదం ఏంటీ..?

కండరాలు విశ్రాంతి సమయంలో కూడా క్యాలరీలను ఖర్చు చేస్తాయి. కండరాలు తగ్గడం వల్ల మెటబాలిజం మరింత స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కండరాల క్షీణత గురించి మనం గమనించాలి. దీనిని ‘సార్కోపెనియా’ అంటారు. ఇది ఒక్క రోజులో జరగదు, చాలా నెమ్మదిగా మొదలవుతుంది. గతంలో సులభంగా చేసిన పనులు ఇప్పుడు భారంగా అనిపించడం.. అంటే త్వరగా అలసిపోవడం. మెట్లు ఎక్కినప్పుడు లేదా బరువులు ఎత్తినప్పుడు చేతులు, కాళ్లు వణకడం. బరువు పెరగకపోయినా, శరీరం వదులుగా మారడం.

Also Read : బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. అసలేం జరుగుతోంది..?

ఎముకల సాంద్రత తగ్గడం కూడా ప్రధాన సమస్య. 30 ఏళ్ల తర్వాత ఎముకలు కొత్త కణాలను నిర్మించే వేగం కంటే, పాత కణాలు విచ్ఛిన్నమయ్యే వేగం పెరుగుతుంది. కారణం లేకుండా మోకాళ్లు, నడుము నొప్పి రావడం. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నుపూస కుంచించుకుపోయి స్వల్పంగా ఎత్తు తగ్గే అవకాశం ఉంటుంది. దవడ ఎముక బలహీనపడటం వల్ల పళ్ళు వదులుగా మారడం. వయసు పెరుగుతున్నా దృఢంగా ఉండాలంటే ఈ మూడు సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం వాకింగ్ సరిపోదు. వారానికి రెండు సార్లు బరువులు ఎత్తడం లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలపడే అవకాశం ఉంటుంది.

Note : ప్రత్యేక గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు, తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్