Friday, June 19, 2026 03:04 AM
Friday, June 19, 2026 03:04 AM

దెబ్బకు దారిలోకి వచ్చిన ట్రంప్..!

మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతోన్న నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దారిలోకి వచ్చిన సంకేతాలే కనపడుతున్నాయి. ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడుల కారణంగా ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ కు చెందిన కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ ఇకపై దాడులు చేయదని ట్రంప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అదే సమయంలో, ఖతార్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన ఇరాన్ ను ట్రంప్ హెచ్చరించారు.

Also Read : ఏపీకి పండగొచ్చింది.. బాబు సర్కార్‌ ఉగాది వరాలు

మధ్యప్రాచ్యంలో జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో ఇజ్రాయెల్, ఇరాన్‌ లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే తీవ్ర దాడి చేసిన నేపధ్యంలో ఇరాన్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయింది. ఖతార్ లోని కీలక చమురు నిల్వలు ఉన్న ప్రాంతాలపై దాడులకు దిగింది ఇరాన్. ఈ నేపధ్యంలో.. సౌత్ పార్స్ దాడులతో వాషింగ్టన్‌ కు సంబంధం లేదని, అది పూర్తిగా ఇజ్రాయెల్ ఆపరేషన్ అని ట్రంప్ వెంటనే స్పష్టం చేశారు. ఖతార్ దేశానికి దీనితో ఏ విధంగానూ సంబంధం లేదు, అలాగే ఇలాంటివి జరుగుతాయని వారికి ఊహకు కూడా అందలేదు అన్నారు ట్రంప్.

Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ రిపోర్ట్..!

ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రంగా చెప్పబడే సౌత్ పార్స్‌ పై నిన్న జరిగిన బాంబు దాడికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్‌ లోని ఐదు ఇంధన కేంద్రాలను రాబోయే మరికొన్ని గంటల్లో లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అధికారులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, గురువారం తెల్లవారుజామున ఇరాన్ వెంటనే ఖతార్‌ లోని ప్రధాన ద్రవీకృత సహజ వాయువు కేంద్రమైన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై క్షిపణి దాడులు చేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ఈ ప్రాంతం, ఈ యుద్ధం సమయంలో పదేపదే లక్ష్యంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్