Friday, June 19, 2026 07:18 AM
Friday, June 19, 2026 07:18 AM

మీకోసమే ఇదంతా.. గిరిజనులతో పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన ప్రాంతాలపై ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్.. పలు రోడ్డు నిర్మాణాలను, అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడుతున్నారు. డిప్యూటి సిఎం అయిన నాటి నుంచి గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా పవన్ పర్యటనలు చేస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లా నందిగరువులో పర్యటించారు.

Also Read : కొరివితో తలగోక్కున్న కావ్య మారన్..!

గిరిజనుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వం కనీసం సమస్యలు కూడా విన్న పరిస్థితులు లేవని గుర్తు చేసారు. మీరెవరూ నన్ను కలిసి రోడ్లు వేయాలని కోరలేదు.. సరైన రహదారి లేక మీరు ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. మీ కష్టాలు చూసే నేను రహదారుల నిర్మాణానికి ఉపక్రమించానని గిరిజనులతో పవన్ పేర్కొన్నారు. ప్రజల కష్టాలు విని పరిష్కరించేందుకే మీ ముందుకొచ్చా.. ఎవరికి ఏ సమస్య ఉన్నా, నాతో పంచుకోండని పవన్ ఈ సందర్భంగా గిరిజనులను కోరారు.

Also Read : పెళ్లిపీటలెక్కనున్న అనుష్క.. ఈసారి నిజంగానే..?

ఈ సందర్భంగా అందరితో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. వారు ఇచ్చిన ఆహార పదార్ధాలను కూడా పవన్ తినడం గమనార్హం. ఇక జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను కూడా గిరిజనులతో కలిసి పవన్ జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లిన పవన్ కల్యాణ్.. గిరిజనులతో కలిసి నడిచారు. ఓనూరు నుంచి నందిగరువు వరకు రోడ్డు పనులను స్వయంగా పరిశీలించారు. థింసా నృత్యంతో పవన్‌ కు అక్కడి గిరిజనులు స్వాగతం పలకారు. నందిగరువులో జనసేన పార్టీ పతాకాన్ని కూడా పవన్ ఆవిష్కరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్