Saturday, March 14, 2026 10:01 PM
Saturday, March 14, 2026 10:01 PM

కొరివితో తలగోక్కున్న కావ్య మారన్..!

ఇంగ్లాండ్‌లో నిర్వహించే ప్రముఖ టీ20 టోర్నమెంట్ అయిన ‘ది హండ్రెడ్’ లీగ్‌కు సంబంధించిన తాజా ప్లేయర్ ఆక్షన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ యాజమాన్యానికి చెందిన నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ (లీడ్స్ ఫ్రాంచైజీ) తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఏడాది జరగనున్న టోర్నమెంట్ కోసం జరిగిన ప్లేయర్ ఆక్షన్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యంతో ఉన్న నాలుగు జట్లు పాల్గొన్నాయి. వాటిలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సన్‌రైజర్స్ గ్రూప్ ఉన్నాయి.

అయితే ఈ ఆక్షన్‌లో ప్రధాన వివాదంగా నిలిచింది పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ డీల్. సన్‌రైజర్స్ యాజమాన్యం అతడిని సుమారు రూ.2.4 కోట్లకు కొనుగోలు చేయడం భారత అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ మొత్తం పాకిస్థాన్ కరెన్సీలో సుమారు 7 కోట్లకు పైగా అవుతుంది. ఇటీవలి కాలంలో భారత్–పాకిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత చర్చకు దారి తీసింది. గతంలో జరిగిన కొన్ని ఘటనల సమయంలో అబ్రార్ చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు కూడా భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైనట్లు గుర్తుచేస్తున్నారు.

Also Read : సీఎంఓ వర్సెస్ ఐఏఎస్.. రూల్స్ ప్రకారమే..!

అలాగే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వికెట్ తీసిన తర్వాత అబ్రార్ ప్రదర్శించిన హావభావాలు కూడా అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. ఈ కారణాలతో భారత అభిమానుల్లో అతనిపై ప్రతికూల భావన పెరిగింది. దీంతో, ఐపీఎల్ ఫ్రాంచైజీలు హండ్రెడ్ లీగ్‌లో పాల్గొననున్నాయని తెలిసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావించారు. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైజర్స్ యాజమాన్యం అబ్రార్‌ను ఎంపిక చేయడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. గత 24 గంటల్లోనే వేల సంఖ్యలో పోస్టులు, ట్వీట్లు వెలువడుతూ ఫ్రాంచైజీపై విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో X లో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వివాదంపై స్పందించిన జట్టు కోచ్ డానియల్ వెటోరీ మాట్లాడుతూ, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ అభిమానులు మాత్రం తమ విమర్శలను కొనసాగిస్తున్నారు.

Also Read : పెళ్లిపీటలెక్కనున్న అనుష్క.. ఈసారి నిజంగానే..?

ఇక ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా? లేక ఈ నిర్ణయం సన్‌రైజర్స్ బ్రాండ్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్నది చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బిజెపికి షాక్ ఇచ్చిన...

ప్రాంతీయంగా కొత్తగా పుట్టిన పార్టీలు అయినా,...

మీకోసమే ఇదంతా.. గిరిజనులతో...

ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన...

వాళ్ల కంటే.. గూగుల్...

"మేము చేసింది చెప్పుకోలేక పోయాము.. చేసింది...

రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.....

రాజకీయాల్లోకి మరో వారసురాలు రెడీ అయ్యారు....

ఎన్టీఆర్ ను అభిమానించే...

హెచ్ జే దొర.. ఈ తరానికి...

రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

అలేఖ్య రెడ్డి.. ఈ పేరు పెద్దగా...

పోల్స్