Friday, May 1, 2026 06:50 AM
Friday, May 1, 2026 06:50 AM

ఇండియన్స్ కు యూఏఈ గుడ్ న్యూస్

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, విమాన రాకపోకల నిలిపివేత కారణంగా యూఏఈ ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన భారతీయులతో సహా ఇతర విదేశీయులకు భారీ ఊరటనిచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిలో ఎక్కువగా భారతీయులు ప్రభావితం అవుతోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28, 2026 నుండి మార్చి 31, 2026 మధ్య కాలంలో గడువు ముగిసే అన్ని రకాల టూరిస్ట్, విజిట్, ట్రాన్సిట్ వీసాలకు ఆటోమేటిక్‌ గా 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

Also Read : భారత్ కు చమురు గుహలు.. మన వైజాగ్ ఎందుకు కీలకం..?

యుద్ధం కారణంగా విమానాలు రద్దు కావడంతో దేశం విడిచి వెళ్లలేకపోయిన వారికి, వీసా గడువు ముగిసినా ఎటువంటి ఓవర్‌ స్టే జరిమానాలు విధించకూడదని అధికారులు నిర్ణయించారు. యూఏఈ వెలుపల ఉండి, యుద్ధం కారణంగా తిరిగి రాలేక వీసా గడువు ముగిసిపోయిన భారతీయులకు కూడా మార్చి 31, 2026 వరకు ఎటువంటి కొత్త పర్మిట్ లేకుండానే తిరిగి దేశంలోకి రావడానికి అనుమతినిచ్చారు. యుద్ధం లేదా ఇతర విపత్తుల వల్ల తీవ్రంగా ప్రభావితమైన వారు ఎటువంటి స్పాన్సర్ అవసరం లేకుండానే ఒక సంవత్సరం పాటు యూఏఈలో ఉండేందుకు ప్రత్యేక ‘హ్యూమనిటేరియన్ రెసిడెంట్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read : వాళ్ల కంటే.. గూగుల్ చాలా బెటర్..!

ఇది అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి భారత్‌ కు వచ్చి ఇక్కడ చిక్కుకుపోయిన విదేశీయుల కోసం భారత ప్రభుత్వం కూడా వారి వీసాలను 30 రోజుల పాటు ఉచితంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులు పునరుద్ధరించబడిన తర్వాత ఈ రాయితీలు ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు తమ విమాన సంస్థలతో లేదా సంబంధిత వెబ్‌సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్