Friday, June 19, 2026 11:53 AM
Friday, June 19, 2026 11:53 AM

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.. పూరి, దోశ బంద్..!

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ సిలెండర్ ల కొరత నేపధ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన మొదలైంది. కొరత లేదని కేంద్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నా, వాస్తవం మాత్రం మరోలా ఉందనే కథనాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. బుకింగ్ వ్యవధిని పెంచడం, అలాగే డెలివరీ టైం కూడా ఆలస్యం అవుతున్న నేపధ్యంలో, అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇక హోటల్స్ యాజమాన్యాల్లో కూడా ఆందోళన మొదలైంది.

Also Read : దానంకు క్లీన్ చిట్.. కేటీఆర్ ట్విట్..!

ఇదే టైంలో హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఉండే హాస్టల్స్ లో కూడా ఫుడ్ ను కుదించాయి యాజమాన్యాలు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. గ్యాస్ ఎక్కువగా వినియోగించే వంటలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గారే, పూరి, దోశ వంటి వంటలను క్యాన్సిల్ చేసారు. అలాగే అప్పడాలు, వేయించే కూరలు వంటివి కూడా హాస్టల్స్ లో క్యాన్సిల్ చేయడం గమనార్హం. అటు హోటల్స్ కూడా గ్యాస్ ఎక్కువగా ఖర్చు అయ్యే మెనూ తగ్గించాయి. ప్రముఖ హోటల్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.

Also Read : ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.. ఈసారి వారికే ఛాన్స్..!

వీటితో పాటుగా కాలేజి యాజమాన్యాలు, ఐటి కంపెనీలలోని క్యాంటిన్ లు కూడా చాయ్ సహా పలు వంటకాల విషయంలో తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సరఫరా మెరుగు అయ్యే వరకు ఇదే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక హోటల్స్, రెస్టారెంట్ లు కూడా ఇలాగే ఫాలో అవుతున్నట్లు సమాచారం. కీలక రెస్టారెంట్ లలో వంటలను తగ్గించేసారు. దానికి తోడు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మీల్స్ విషయంలో కూడా తగ్గించాయి యాజమాన్యాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

పోల్స్