Wednesday, March 11, 2026 10:01 PM
Wednesday, March 11, 2026 10:01 PM

లోకేష్ సీఎం.. ముహూర్తం ఫిక్స్..!

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లోనూ అటువంటి పరిణామాలు ప్రారంభమయ్యాయి. నూతన ముఖ్యమంత్రిగా మంత్రి నారా లోకేష్ ప్రమాణ స్వీకారంతో పాటు, ప్రస్తుత మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయం జరిగినట్టు తాజా సమాచారం. పూర్తిగా ఈ మంత్రివర్గంపై లోకేష్ ముద్ర ఉంటుందని, భారీ మార్పులు ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది. ప్రస్తుత మంత్రివర్గంలో కొంతమంది సీనియర్లకు ఉద్వాసన తప్పదు అంటున్నారు. ప్రభుత్వంపై, పార్టీపై పూర్తిగా తన అదుపు ఉండాలనే ఆలోచనతోనే శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఆత్మీయ కలయికల పేరుతో, శాసన సభ్యుల కుటుంబాలను తమ ఇంటికి ఆహ్వానించి విందు ఇవ్వడం వ్యక్తిగతంగా వారితో తన సంబంధాలను ఆత్మీయంగా పెంచుకోవడానికే అని అర్థమవుతుంది.

Also Read : పవన్ మాట వినరేం..? ఇంకెన్నాళ్ళు ఈ జాగు..!

ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొంత సమయం తీసుకోవాలనుకుంటే, ముందుగానే ఆయన ముద్ర గల మంత్రివర్గం పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. కొందరు సీనియర్లను తప్పిస్తారని, కొందరు సీనియర్ల వారసులకు లేదా వారు సూచించిన వారికి అవకాశాలు లభించవచ్చు అనే మాట బాగా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఉగాది నాడు మంత్రివర్ణ ప్రక్షాళన జరుగుతుందని అమరావతిలో ఒక ప్రచారం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనయుని వివాదం, విజయనగరం జిల్లాలోని మంత్రి వైఫల్యం, శ్రీకాకుళం జిల్లా నేతలు ఎడముఖం, పెడముఖం, అనకాపల్లి జిల్లాలో స్పీకర్ పదవి పల్ల అయ్యన్నపాతుడు సంతృప్తిగా లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో కొన్ని మార్పులు జరుగుతాయని ఊహిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ఇటీవల కీలక సమావేశం జరిగింది. బయటకు చెప్పిన అజెండా ఏమైనా, లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న తన నిర్ణయం, తన భవిష్యత్ కార్యాచరణ, నాయకత్వం మారినా, మిత్రధర్మాలు యధాతథంగా కొనసాగించే విశ్వాసం కల్పించడం వంటి అంశాలను చంద్రబాబు చెప్పినట్లు ఒక సమాచారం పవన్ కళ్యాణ్ కూడా గౌరవంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇద్దరు మధ్య జరిగిన చర్చలకు మూడో మనిషి సాక్షిగా లేకపోయినా, టీడీపీ వర్గాల్లో అంతర్గత ఊహాగానాలు, తెలిసీ తెలియని సమాచారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకు గల పరిచయాలు, సంబంధాలు, వాణిజ్య బంధాలను చంద్రబాబు, లోకేష్‌కు పరిచయం చేస్తూ, బాధ్యతలను అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : సరికొత్త వ్యూహం.. తీవ్రత పెంచిన ఇరాన్..!

ఢిల్లీ పెద్దలకు కూడా ఇప్పటికే లోకేష్ తన వారసుడుగా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తాడని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. బీజేపీ నాయకులు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం అవసరమని, తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కూడా ఇటీవల ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి వారితో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన కనుసన్నల్లోనే రాష్ట్ర మంత్రులు, పాలన యంత్రాంగం పనిచేస్తుందనేది బహిరంగ రహస్యం. ప్రత్యేకంగా హోం శాఖ ఆయన ఆదేశాలు, సూచనలు ప్రకారమే పనిచేస్తుందన్న అభిప్రాయము ఎక్కువ మందికి ఉంది. కార్యకర్తకు విలువ ఇచ్చే నాయకుడిగా పార్టీలోనూ లోకేష్ పట్ల నమ్మడం, గౌరవం ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టాలని, చంద్రబాబు మార్గదర్శకత్వంలో ప్రస్తుత కాలానికి, కొత్త తరానికి సమర్థవంతుడైన నాయకుడిగా ఆయన పనిచేయగలడని పార్టీ కార్యకర్తలు కూడా ఆశతో ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.....

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ...

పెంచలయ్య సరే.. మరి.....

తిరుమల పరకామణిలో బంగారం, వెండి అపహరణకు...

రైతన్నలకు సిఎం చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సిఎం చంద్రబాబు...

దానంకు క్లీన్ చిట్.....

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

పోల్స్