Thursday, September 17, 2026 10:42 PM
Thursday, September 17, 2026 10:42 PM

ఇరాన్ ఆయిల్ కు “గోల్డ్ లిక్విడ్” అనే బిరుదు ఎందుకు..?

పేదవాడు ఆహారం కోసం పోరాటం చేస్తే.. అమెరికా ఆయిల్ కోసం పోరాటం చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఏ దేశంపై అమెరికా దాడి చేసినా లేదా వారిని తమ కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకున్నా దాని వెనుక ప్రధాన కారణం ఆయిల్. దక్షిణ అమెరికా దేశాల్లో అమెరికా దండ యాత్రకు కూడా ఆయిల్ ప్రధాన కారణం. ఇప్పుడు ఇరాన్ పై యుద్దానికి దిగడం వెనుక కారణం కూడా ఇదే. అన్ని దేశాల ఆయిల్ కంటే ఇరాన్ ఆయిల్ పై అమెరికాకు లవ్ ఎక్కువ. దీనికి ఇంటర్నేషనల్ గా ఉండే డిమాండ్ కూడా ఎక్కువే. అసలు ఏంటి ఆ రీజన్..?

Also Read : సరికొత్త వ్యూహం.. తీవ్రత పెంచిన ఇరాన్..!

ఇరాన్ రోజుకు దాదాపు 3.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇరానియన్ ముడి చమురును రెండు గ్రేడ్ లుగా చెప్పవచ్చు. ఇరాన్ లైట్, ఇరాన్ హెవీ అని పిలుస్తారు. రెండు గ్రేడ్ లు కూడా డిమాండ్ ఉన్నవే. ఇరాన్ లైట్, దాదాపు 33 నుండి 36 డిగ్రీల ఏపీఐ గ్రావిటీ వద్ద ఉంటుంది. దాదాపు 1.46 శాతం సల్ఫర్ కంటెంట్ కలిగి ఉంటుంది. రద్దు తక్కువగా ఉండి.. అధిక మొత్తంలో గ్యాసోలిన్, డీజిల్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఏపీఐ గ్రావిటీ అనేది నీటితో పోలిస్తే తేలికగా ఉంటూ.. ముడి చమురు ఎంత ఉందో కొలిచే పద్ధతి.

Also Read : ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక మార్పు

ఈ సంఖ్య ఎక్కువగా ఉంటే, తేలికైన ముడి చమురుగా భావిస్తారు. దీని నుంచి సాధారణంగా పెట్రోల్, జెట్ ఇంధనం వంటి ఇంధనాలలో వాడతారు. దీనిని శుద్ధి చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి వాల్యూ ఎక్కువ. ఇరాన్ ముడి చమురు సాంద్రత కారణంగా ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీ. అందుకే మన ఆసియా చమురు శుద్ధి కర్మాగారాలు దీనిని ఎక్కువగా ఇష్టపడతాయి. ఈ చమురు కారణంగా చైనా ఎక్కువగా లాభపడుతోంది. 2024లో ఇరాన్ చమురు ఎగుమతి ఆదాయంలో 90 శాతానికి పైగా చైనా ఉంది. దాదాపు 32.5 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది చైనా. అధిక-సల్ఫర్ ఉంటే ముడి చమురుకు విలువ ఎక్కువ. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ ముడి చమురు కోసం పలు దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. ఇరాన్ ముడి చమురుతో ఆదాయం భారీగా ఉంటుంది. అందుకే దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్