Thursday, September 17, 2026 10:45 PM
Thursday, September 17, 2026 10:45 PM

యుద్దాన్ని నువ్వు కాదు మేము శాసిస్తాం: ఇరాన్ వార్నింగ్

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఇప్పట్లో ఆగే సంకేతాలు కనపడటం లేదు. రోజు రోజుకి ఇరాన్ తన సైనిక చర్యల వేగం పెంచుతూనే ఉంది. ఏ ప్రాంతం మీద ఆ రెండు దేశాలు దాడి చేసినా.. తాను చేయాలనుకున్నది ఇరాన్ చేసి చూపిస్తోంది. గల్ఫ్ దేశాలతో పాటుగా ఇజ్రాయిల్ రాజధానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కీలక ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ డిపోలను ఇరాన్.. లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అటు గల్ఫ్ దేశాలకు సారీ చెప్పినట్లే చెప్పి.. తమ దాడులను వేగవంతం చేసింది.

Also Read : ఆఫ్ ది రికార్డు.. కొలికపూడి గురించే..!

ఇక తాజాగా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా రియాక్ట్ అయింది. ఇరాన్‌లో యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో తమకు తెలుసు అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయింది. యుద్ధం ఎప్పుడు ఆపాలో నిర్ణయం తీసుకునేది తామే అంటూ క్లారిటీ ఇచ్చింది. యుద్ద భవిష్యత్తు తమ బలగాల చేతుల్లో ఉందని పేర్కొంది. త్వరలోనే యుద్ధం ఆగిపోతుంది అంటూ ట్రంప్ ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : ఆ ఇద్దరికే గంభీర్ క్రెడిట్.. ఎవరూ ఊహించని పేర్లు..!

అమెరికా దళాలు.. యుద్దాన్ని ముగించలేవు అంటూ స్పష్టం చేసింది. అటు ఇజ్రాయిల్ పై అమెరికా సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గత వారం చివర్లో ఇరాన్ లోని 30 ఆయిల్ డిపోలపై ఇజ్రాయిల్ బలగాలు చేసిన దాడులపై అమెరికా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇక హార్మోజ్ జల సంధిని ఇరాన్ మూసి వేయడంతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ ను బెదిరించినా దాడులు చేసినా సరే.. హార్మోజ్ విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్