Friday, June 19, 2026 12:57 PM
Friday, June 19, 2026 12:57 PM

తిరువూరుకు కొత్త బాస్.. తెరపైకి కొత్త పేరు..!

వరుసగా నాలుగు సార్లు పార్టీ ఓడిన నియోజకవర్గంలో 20వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే తొలిరోజు నుంచే.. తనదైన దూకుడుతో వ్యవహరిస్తూ.. అటు పార్టీకి, ఇటు తన రాజకీయ జీవితానికి ఇబ్బందుల కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇంతకూ ఆయన ఎవరో కాదు.. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. 2019 వరకు వైసీపీలో ఉన్న కొలికపూడి.. అమరావతి ఉద్యమంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. స్థానికేతరుడు అయినా కూడా.. కొలికపూడికి తిరువూరు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. మీడియా సపోర్టుతో పాటు జగన్‌పై వ్యతిరేకత, టీడీపీ అనుకూల గాలి కారణంగా కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఓడిన నియోజకవర్గంలో గెలవటంతో ఇక ఆయనకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

Also read : లక్ష్మీ దుర్గ ఎక్కడ.. పోలీసులకు నిజంగా తెలియదా..?

గెలిచిన తొలిరోజు నుంచే తనదైన ఆరోపణలతో పార్టీని ఇబ్బందులకు గురి చేశారు. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీతో లడాయి పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. స్థానిక నేతలతో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. కొత్త ఇంఛార్జ్‌ను నియమించండి అంటూ టీడీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన తిరువూరు నేతలు.. పార్టీ అధ్యక్షుడి ముందే ధర్నా చేశారు. దీంతో బుద్దిగా, సైలెంట్‌గా ఉంటా అంటూ అధినేతకు వివరణ ఇచ్చారు కొలికపూడి. కానీ ఆయన తీరు మారలేదు. తాజాగా నెమలి గ్రామంలో స్వామి వారికి కల్యాణోత్సవంలో మళ్లీ గొడవ చేశారు. దీంతో కొలికపూడిపై వేటు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది.

నియోజకవర్గం నేతలంతా కొలికపూడి స్థానంలో మళ్లీ స్వామిదాస్‌ను నియమించాలని కోరుతున్నారు. కానీ తాజాగా కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన వర్ల రామయ్య. కొలికిపూడి, కేశినేని చిన్ని మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు చేయబోతున్న ఆలోచన. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఉండబోతుందట. ఏమిటా ఒక దెబ్బ కు రెండు పిట్టలు. ఎస్సీ దండోరా సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తే.. కొలికపూడి, చిన్ని వర్గాలు సైలెంట్‌గా ఉంటాయని.. ఇద్దరి దూకుడుకు చెక్ పెట్టినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Also read : తమిళనాట ఏపీ ఫార్ములా.. పవన్ తో విజయ్ కు గాలం..?

వర్ల రామయ్య పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు. ఆయన చంద్రబాబు, లోకేష్‌లను తప్ప.. మరెవరిని లెక్క చేయరు. నియోజకవర్గంలో ఎవరైనా సరే.. ఆయన మాటకు కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే పోలీస్ మార్క్ దెబ్బ తప్పదు. వర్లకు అన్ని వర్గాల మద్దతు ఉంది. అందుకే ఆయనను తిరువూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా నియమిస్తే, ఎమ్మెల్యే కొలికిపూడి ఏమనలేరు.. ఎంపీ కేశినేని చిన్ని కూడా తిరువూరు నియోజకవర్గంలో కలుగ చేసుకోలేరు. వేలు పెట్టరు. ముల్లును, ముల్లుతోనే తీయాలనే ఆలోచనతో కొలికిపూడికి ఆయన కులానికి చెందిన నేతతోనే షాక్ ఇవ్వాలి.. ఎంపీ చిన్నీ కూడా బుద్దిగా ఉంటారు. ఎందుకంటే.. వర్ల రామయ్యతో పెట్టుకుంటే.. ఏమవుతుందో అందరికీ తెలుసు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

పోల్స్