Thursday, September 17, 2026 08:50 PM
Thursday, September 17, 2026 08:50 PM

జయలలితపై.. మోడీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బ్రతికి ఉన్న రోజుల్లో, ఆమెతో మంచి స్నేహం ఉండేది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. జయలలిత జయంతి సందర్భంగా మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర కామెంట్స్ చేసారు. అమ్మతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జయలలిత ఘన నివాళులు అర్పిస్తున్నా అని మోడీ తెలిపారు. అమ్మ ఒక అసాధారణమైన పరిపాలకురాలు అని ఈ సందర్భంగా ఆకాశానికి ఎత్తేసారు.

Also Read : ఇండియన్స్ కు ట్రంప్ బిగ్ షాక్..?

ప్రజా సంక్షేమం కోసం ఆమె చాలా కృషి చేసినట్లు మోడీ ప్రసంశించారు. సంక్షేమం కోసం పాటుపడే మనస్తత్వం ఉన్న నాయకులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో ఉంటారని మోడీ కామెంట్స్ చేసారు. అమ్మ జయలలిత అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళ ప్రజల అభ్యున్నతి కోసం జయలలిత ఎంతో కృషి చేసారని మోడీ పేర్కొన్నారు. అమ్మ అమలు చేసిన సంక్షేమ పథకాలు అద్భుతమని ఈ సందర్భంగా ప్రశంసించారు.

జయలలిత పరిపాలనలో, వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో స్పష్టంగా ఉండేవని మోడీ గుర్తు చేసుకున్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె ఎంతో కృషి చేసినట్లు తెలిపారు మోడీ. జయలలిత జీవిత ప్రయాణం ఎంతో పట్టుదల, మనోధైర్యంతో కూడుకున్నదన్నారు. ఇద్దరూ సిఎంలుగా పని చేసిన రోజులను కూడా మోడీ గుర్తు చేసుకున్నారు. 2002, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జయలలిత హాజరు అయ్యారని తెలిపారు.

Also Read : ఏపీ తెలుగు మహిళగా స్వామి శిష్యులు..!

గతంలో పొంగల్ పండుగ సందర్భంగా చెన్నైలో ఆమె తనను భోజనానికి ఆహ్వానించారని కూడా మోడీ ప్రస్తావించారు. ఆ ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేననన్నారు. సుపరిపాలన గురించి తామిద్దరం తరచుగా చర్చించుకునేవాళ్లమన్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడు ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలను ఆకట్టుకునే విషయంలో స్పష్టమైన క్లారిటీ ఉన్న మోడీ.. కావాలనే జయలలితపై ప్రసంశలు కురిపించారంటూ నెటిజన్ లు చర్చించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్