Thursday, August 6, 2026 08:30 AM
Thursday, August 6, 2026 08:30 AM

ఆపరేషన్ సిందూర్ టార్గెట్ పాక్ ప్రధాని.. ట్రంప్ సంచలనం..!

స్వర డబ్బా.. అంటే తన గురించి తాను డప్పు కొట్టుకోవడంలో ముందుంటారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. యుద్దాలు ఆపే విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు చూస్తే.. స్వర డబ్బా ఏ లెవెల్ లో ఉంటుందో అర్ధమవుతుంది. భారత్ – పాక్ దేశాల మధ్య యుద్దాన్ని ఆపానని, దానితో పాటుగా మరో 7 నుంచి 8 యుద్దాలను ఆపాను అంటూ ట్రంప్ పదుల సార్లు చెప్పుకున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యల తీవ్రతను పెంచారు ట్రంప్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియా దేశాలపై ట్రంప్ ఎక్కువగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : అందరి జాతకాలు బయటపెడతా..!

అమెరికా జోక్యం చేసుకోకపోతే.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో దాదాపు 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తనతో చెప్పారని ట్రంప్ చెప్పుకొచ్చారు. యూఎస్ కాంగ్రెస్‌లో తన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో మాట్లాడిన ట్రంప్.. తాను లేకపోయి ఉంటే.. భారత్ – పాక్ అణు యుద్దాన్ని ఎదుర్కొనేవి అంటూ కామెంట్ చేసారు. తాము మరో యుద్దాన్ని ముగించేందుకు కష్టపడుతున్నామని తెలిపిన ట్రంప్ ఓ ఆసక్తికర కామెంట్ చేసారు.

Also Read : జగన్ ను తిట్టోద్దని పవన్ చెప్పారా..?

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ ప్రధాని షరీఫ్ కూడా చనిపోయే వారంటూ సంచలన కామెంట్ చేసారు. 80 సార్లు ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడిన ట్రంప్.. ఈసారి మాత్రం కాస్త తీవ్రత పెంచారు. కాగా ఆపరేషన్ సిందూర్ లో భారత్ దాదాపుగా 300 కిలోమీటర్లు పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులకు దిగింది. ఆ తర్వాత ట్రంప్ జోక్యం చేసుకోవడంతో యుద్ధం ముగిసింది. రెండు దేశాల సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాత ఆపరేషన్ సిందూర్ ను విరమించింది భారత్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్