Wednesday, October 7, 2026 07:01 AM
Wednesday, October 7, 2026 07:01 AM

ఏడ్చేసిన పాక్ ఆటగాళ్ళు.. హెడ్ కోచ్ సంచలన కామెంట్స్

వేదిక ఏదైనా.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ దే ఆధిపత్యం అనే విషయం మరోసారి స్పష్టమైంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాల నుంచి.. వర్షం వరకు ప్రతీ ఒక్కటి కంగారు పెట్టించిన పరిస్థితి. చివరకు రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. యధావిధిగా పాక్ ఓడిపోయింది. ఆసియా కప్ లో మూడు మ్యాచ్ లు ఇప్పుడు మరో మ్యాచ్.. వరుసగా నాలుగు ఓటములు మూటగట్టుకుంది పాక్. బౌలింగ్ లో పర్వాలేదనిపించినా బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిల్ అయింది.

Also Read: భారత్‌కు శివరాత్రి.. పాకిస్తాన్‌కు కాళరాత్రి..!

ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది. దీనిపై పాక్ హెడ్ కోచ్ మైక్ హస్సన్ స్పందించాడు. ఓటమి తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌ లో చాలా బాధ పడ్డారని చెప్పుకొచ్చాడు. భారత్‌తో పాకిస్తాన్‌ ఆడటం చాలా పెద్ద ఈవెంట్ అని తమకు తెలుసు అన్నాడు. అందుకే ఆటగాళ్ళు కొందరు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో గెలుస్తామని తాము ధీమాగా ఉన్నామన్నాడు. ఈ మ్యాచ్ ప్రభావం ఆటగాళ్ళపై భారీగా పడిందని తెలిపాడు.

Also Read : గేట్స్ రాకతో ఏపీకి గ్లోబల్ అటెన్షన్

ప్రపంచ కప్ కు ముందు తాము చాలా మంచి క్రికెట్ ఆడినట్లు తెలిపాడు. కానీ భారత్ తో మ్యాచ్ లో ఫెయిల్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రారంభంలో బంతి బాగా తిరుగుతుందని ఆశించినట్లు తెలిపాడు. అభిషేక్ వికెట్ తో చాలా మంచి స్టార్ట్ లభించినా.. ఇషాన్ ఆడిన విధానమే తమకు మ్యాచ్ ను దూరం చేసింది అన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవడంతో భారత్ సూపర్ 8 స్టేజ్ లో అడుగుపెట్టింది. ఇక పాక్ సూపర్ 8 కు వెళ్ళాలి అంటే బుధవారం నమీబియాతో జరిగే చివరి మ్యాచ్‌లో గెలవాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్