దాదాపు రెండేళ్ళ నుంచి అల్లర్లతో, అస్థిరతతో ఇబ్బంది పడుతోన్న బంగ్లాదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) భారీ విజయం సాధించింది. మతతత్వ పార్టీ అయిన జమాతే లీగ్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలిసారి మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ లేకుండానే ఎన్నికలు జరిగాయి. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఎన్నికలు భారత్ పై కూడా ప్రభావం చూపనున్నాయి.
Also Read : అమెరికాలో వైద్యుల కొరత.. ట్రంప్‌పై మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం..!
ఇక 60 ఏళ్ల రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రి కానున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో మరణించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ అధినేత్రి ఖలీదా జియా గత ఏడాది మరణించారు. ఇలా ఇద్దరు మాజీ ప్రధానులు లేకుండా జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. దశాబ్దాలుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న ఈ ఇద్దరూ లేకుండా తొలి ఎన్నికలు ఇవే. జియా కుమారుడు తారిఖ్ రెహమాన్. తన తల్లి మరణం తరువాత దాదాపు 17 సంవత్సరాల తర్వాత ప్రవాసం నుండి దేశానికి తిరిగి వచ్చారు రెహమాన్.
Also Read : ఇది చంద్రబాబు ఇచ్చే వార్నింగ్.. కొలికపూడికి పల్లా హెచ్చరిక..!
అవామీ లీగ్ లేకపోవడంతో ప్రధానమంత్రి పదవికి ఆయనే కీలకంగా మారారు. ఇక రెండు చోట్ల ఆయన పోటీ చేయగా.. రెండింటి నుంచీ ఎన్నికయ్యారు. ఇక బిఎన్‌పిని నిర్ణయాత్మక విజయం వైపు నడిపించినందుకు తారిఖ్ రెహమాన్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బంగ్లాదేశ్ అభివృద్దికి భారత్ సహకరిస్తుందని మోడీ స్పష్టం చేసారు. రహమాన్ తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు మోడీ. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ పదవి నుంచి తప్పుకుంటారు.

