Tuesday, February 10, 2026 06:46 PM
Tuesday, February 10, 2026 06:46 PM

రాజ్యసభ సభ్యులుగా వాళ్లే ఫిక్స్..!

ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది. ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ముగ్గురి పదవీ కాలం ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కానుండగా.. మరో సభ్యుడిది డిసెంబర్‌ నాటికి ముగియనుంది. దీంతో ఇప్పటి నుంచి పెద్దల సభలో అవకాశం కోసం కూటమి పార్టీల్లో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నాలుగు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశం ఉంది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా మూడు పార్టీల నేతలు తమకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కూటమి పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయంపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. ఎవరిని పెద్దల సభకు పంపిస్తే బాగుంటుంది.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే అంశంపై చర్చలు జరుపుతూనే ఉన్నారు.

Also Read : ఏకి పారేస్తున్న నేషనల్ మీడియా.. జగన్ అండ్ కో ఊహించని షాక్..!

అయితే రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగిసేందుకు ఇంకా నాలుగు నెలలు గడువుంది. కానీ ఈలోపే అభ్యర్థులు వీళ్లే అంటూ పలువురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ తరఫున పవన్ సోదరుడు చిరంజీవిని ఎంపిక చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ తరఫున కూడా పెద్దల సభలో ప్రాతినిధ్యం వహించేందుకు చాలా మంది సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం అటు టీడీపీలో ఉన్న సీనియర్లతో కూడా మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు, పవన్, మాధవ్ మధ్య ఇదే విషయం చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే అలాంటిదేం లేదని పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో పెట్టి పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రైజ్ గ్రూప్ పేరుతో సర్వే సంస్థ నిర్వహిస్తున్న ప్రవీణ్ పుల్లటకు ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ప్రవీణ్ సూచనలను పార్టీ పెద్దలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. గతంలో పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వంతో పాటు, పార్టీలను కూడా ప్రవీణ్ పుల్లట సున్నితంగా హెచ్చరించారు. ఇలా అయితే మనుగడ కష్టమే అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అందుకే ప్రవీణ్ పుల్లట ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్‌లో వైరల్‌గా మారింది.

Also Read : ఏ టైం అయినా.. డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటి..!

ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్.నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వానీ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌తో మునిగియనుంది. టీడీపీ సభ్యులు సానా సతీష్ పదవీ కాలం డిసెంబర్ నెలతో ముగుస్తుంది. దీంతో ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీల పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. టీడీపీ తరఫున మరోసారి సానా సతీష్‌కు దాదాపు ఖరారు చేశారు. మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుల్లో సానా సతీష్ ఒకరు. అందుకే మరోసారి కూడా సతీష్ పేరు దాదాపు ఖాయం చేశారు. ఇక టీడీపీ తరఫున మరో అభ్యర్థిగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు ఖరారైనట్లు ప్రవీణ్ పుల్లట పోస్ట్ చేశారు. రామకృష్ణ లేదా.. అని క్వశ్చన్ మార్క్ పెట్టారు తప్ప.. మరో పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇటీవల లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలను భాష్యం రామకృష్ణ టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడుకు అందించారు.

ఇక మిగిలిన రెండు స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రవీణ్ స్పష్టం చేశారు. జనసేన తరఫున ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ బాబు, బీజేపీ తరఫున తమిళనాడుకు చెందిన అన్నామలైకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ప్రవీణ్ పుల్లట తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరి నిమిషంలో బీజేపీ ఏదైనా ఒత్తిడి చేస్తే తప్ప ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లే అంటూ ప్రవీణ్ పుల్లట ట్వీట్ చేశారు. దీంతో ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లే అనే చర్చ ఇప్పుడు కూటమి పార్టీ నేతల్లో జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పదవుల ఆరాటమే.. విమర్శలు...

2014 నుంచి 2019 వరకు ఏపీలో...

మళ్లీ ఆ రోజే...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల...

ఏకి పారేస్తున్న నేషనల్...

రాజకీయాలపై మీడియా ప్రభావం ఎక్కువ. ఛాన్స్...

ఆ మాట మాట్లాడవద్దు.....

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల...

రూ.750 కోట్లు డిపాజిట్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో...

అంబటి మరో పోసాని...

రాజకీయాల్లో నోటి దూల సహజమే.. అది...

పోల్స్