Tuesday, February 10, 2026 04:06 PM
Tuesday, February 10, 2026 04:06 PM

మళ్లీ ఆ రోజే సభకు.. ఆ తర్వాత..!

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు కూడా. ఇక బడ్జెట్ సమావేశాలకు అన్ని పార్టీల సభ్యులు హాజరుకావాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పిలుపునిచ్చారు కూడా. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. ఆ మరుసటి రోజున గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానం ఉంటుంది.

Also Read : రూ.750 కోట్లు డిపాజిట్ చేసిన రాజ్ కేసిరెడ్డికి..?

ఏపీలో 2024 ఎన్నికల తర్వాత వైసీపీ సభ్యులు అసెంబ్లీకి కేవలం రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి తొలిసారి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత గతేడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజు మాత్రమే సభకు వచ్చారు. ఆ సమావేశాలకు కూడా తొలిరోజు గవర్నర్ ప్రసంగం రోజున సభకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు.. సరిగ్గా 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్‌తో కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని నినాదాలు చేస్తూ.. ప్రసంగం పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సభకు రాలేదు. అయితే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు రాకున్నా కూడా.. బయట లాబీల్లోనే రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోతున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఏ టైం అయినా.. డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటి..!

తాజాగా బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ నేపథ్యంలో వైసీపీ సభ్యులు సభకు హాజరవుతారా..? లేదా..? అనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఈ చర్చకు బ్రేక్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే సభకు హాజరవ్వాలని నిర్ణయించారు. తొలిరోజు గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. ప్రసంగం పూర్తైన వెంటనే సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి.. సభ ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయం నిర్ణయిస్తారు. కాబట్టి గవర్నర్ ప్రసంగం తర్వాత సభ నుంచి వాకౌట్ చేయాలనేది వైసీపీ నేతల భావన. నిజానికి గత 6 నెలలుగా కనీసం ఒక్కసారి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవ్వలేదు. దీనిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు పాల్గొనే యోచనలో వైసీపీ నేతలు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజ్యసభ సభ్యులుగా వాళ్లే...

ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది....

ఏకి పారేస్తున్న నేషనల్...

రాజకీయాలపై మీడియా ప్రభావం ఎక్కువ. ఛాన్స్...

ఆ మాట మాట్లాడవద్దు.....

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల...

రూ.750 కోట్లు డిపాజిట్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో...

అంబటి మరో పోసాని...

రాజకీయాల్లో నోటి దూల సహజమే.. అది...

చంద్రబాబుపై.. బీజేపీ ఎమ్మెల్యే...

ఒక వైపు ఏమో కమ్మ కులం...

పోల్స్