Friday, March 27, 2026 09:58 PM
Friday, March 27, 2026 09:58 PM

పదవుల ఆరాటమే.. విమర్శలు ఎక్కడ..? కూటమితో ఏపీ బిజేపి మైండ్ గేమ్..?

2014 నుంచి 2019 వరకు ఏపీలో ఎన్డియే అధికారంలో ఉండేది. 2018 ఆరంభం నాటికి ఎన్డియే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. కేంద్రం సహకారం లేకపోవడంతో టీడీపీ.. తప్పుకుంది. ఆ సహకారం లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటీ అంటే.. సోము వీర్రాజు అధ్యక్షుడిగా.. జీవీఎల్ నరసింహారావు ఉపాధ్యక్షుడిగా నడిపిన డ్రామాలే కారణం అని టీడీపీ ఇప్పటికీ తిడుతూ ఉంటుంది. అందుకే 2024 లో ఈ సమస్యలు లేకుండా ఏపీ బిజెపికి మెరుగులు దిద్ది.. రంగంలోకి దించింది అధిష్టానం.

Also Read : ఆ మాట మాట్లాడవద్దు.. మంత్రులకు చంద్రబాబు వార్నింగ్..!

దగ్గుబాటి కుటుంబం నారా కుటుంబానికి దగ్గర కావడంతో.. బిజెపి ఆ పరిణామాన్ని వాడుకుని అడుగులు వేసింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు మళ్ళీ బిజెపిలో స్వరం మారుతోంది. కూటమిలో చీలిక తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి అనే మాట వినపడుతోంది. తమకు పదవులు రాలేదని, తాము అనుకున్నది జరగలేదని మాట్లాడే బిజెపి నేతలు.. అధికారంలో ఉండి కూడా వైసీపీని విమర్శించే విషయంలో ముందుకు రావడం లేదు. కల్తీ లడ్డు వ్యవహారంలో కళ్ళు మూసుకున్నరనే విమర్శలు వస్తున్నాయి.

Also Read : ఏకి పారేస్తున్న నేషనల్ మీడియా.. జగన్ అండ్ కో ఊహించని షాక్..!

హిందుత్వ పార్టీగా ఉన్న బిజెపి.. కల్తీ వ్యవహారంలో ముందు ఉండాలి. వారి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా నిరసనలు చేయాలి. టీటీడీ ఆలయాల ముందు సంప్రోక్షణ కార్యక్రమాలు, నిరసనలు చేయాలి. రాష్ట్ర బిజెపి నేతలు వైసీపీ కార్యాలయాలను ముట్టడించాలి.. మీడియా సమావేశాలతో, సోషల్ మీడియా వీడియోలతో ఉక్కిరిబిక్కిరి చేయాలి. తమ పెద్దలను కలిసి పాపం గురించి చెప్పాలి. కానీ ఇవేమీ ఏపీ బిజెపి చేయకుండా.. కులాలు, పదవులు అంటూ విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు బహిరంగంగా ఘాటు విమర్శలు చేయలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కేసు.....

ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ...

తిరుమలను తాకిన గ్యాస్...

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్...

డిప్యూటీ స్పీకర్ రఘురామపై...

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత...

బ్రేకింగ్: బయటపడ్డ అగ్ని...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత కొద్దిరోజులుగా...

నిజామాబాద్ వేదికగా కవిత...

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

సీట్ల పెంపు.. ఎవరికి...

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న...

పోల్స్