Saturday, September 26, 2026 10:16 PM
Saturday, September 26, 2026 10:16 PM

అంబటి మరో పోసాని అవుతారా..?

రాజకీయాల్లో నోటి దూల సహజమే.. అది మితిమీరితే మాత్రమే ఊహకు అందని పరిణామాలు ఉంటాయి. ఈ రూల్ ఏ పార్టీకి అయినా వర్తిస్తుంది. ఇది మర్చిపోయిన నాయకులు గతంలోనూ, వర్తమానంలోను ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో ఒకరు అంబటి రాంబాబు.. పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం ఏదొకటి అనడం వరకు బాగానే ఉంది గాని.. ఇటీవల విజ్ఞత మరిచి సిఎం హోదాలో ఉన్న వ్యక్తిని దూషించిన తర్వాత అంబటి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటున్నారు.

Also Read : నమ్మకం లేదు.. కానీ అదే నిజం.. ఇదే లాజిక్కు..!

ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదు అయ్యాయి. నల్లపాడులో నమోదు అయిన కేసు మొదలుపెడితే.. చిత్తూరు జిల్లా వరకు కేసులు నమోదు చేసారు. ఒక్క కేసులో మాత్రమే వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ వచ్చింది. మిగిలిన 35 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక కేసులో మాత్రమే ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు పీటీ వారెంట్ తో రాష్ట్ర వ్యాప్తంగా అంబటి పర్యటనలు కొనసాగుతాయనే మాట వినపడుతోంది. తనను అరెస్ట్ చేసుకుంటే బట్టలు సర్దుకుని వచ్చేస్తా అని చెప్పిన అంబటి.. ఇప్పుడు పీటీ వారెంట్ పై తిరగనున్నారు.

Also Read : సిగ్గు సిగ్గు.. జగన్‌ పరామర్శకు ఇవేనా అర్హతలు..?

గతంలో పోసాని కృష్ణ మురళి, బోరుగడ్డ అనీల్ కుమార్ ఇలాగే రాష్ట్రం మొత్తం పీటీ వారెంట్ లతో తిరిగారు. ఇప్పుడు అంబటి కూడా పీటీ వారెంట్ లు ఎదుర్కొంటారు. తాజాగా రాజమహేంద్రవరం జైలు నుంచి గుంటూరు తరలించారు. పీటీ వారెంట్‌పై అంబటిని గుంటూరు తరలించారు. వయసు రిత్యా పీటీ వారెంట్ లు అంబటికి ఖచ్చితంగా ఇబ్బందే. ఇక తనపై నమోదు అయిన రెండు కేసులను క్వాష్ చేయాలని అంబటి పిటీషన్ లు కూడా దాఖలు చేసారు. అవి ఏపీ హైకోర్ట్ లో విచారణకు రానున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్