Thursday, February 5, 2026 11:06 PM
Thursday, February 5, 2026 11:06 PM

ఉదయాన్నే వేడి నీళ్ళు తాగితే..? ఇన్ని లాభాలు ఉంటాయా..?

అనారోగ్య సమస్యలు రోజు రోజుకి పెరిగిపోవడంతో ఈ రోజుల్లో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఎన్నో అలవాట్లు మార్చుకుంటున్నారు జనాలు. అందులో ఒకటి ఖాళీ కడుపుతో వేడి నీళ్ళు తాగడం. ఇది చాలా మంచిది అనే మాట వినపడుతోంది. దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాఫీ తాగడం కంటే గోరు వెచ్చని నీరు ఒక గ్లాస్ తాగడం చాలా మంచిది. ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రకారం , 500 మి.లీ నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు 30% పెరుగుతుంది.

Also Read : ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.. చంద్రబాబు ఉగ్రరూపం

చల్లటి నీళ్ళు తాగడం కారణంగా.. మన శరీరం మళ్ళీ ఆ నీటిని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకు తెలియకుండానే ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అలా కాకుండా వేడి నీళ్ళు తాగితే.. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అజీర్ణం లేదా అజీర్తి, తరచుగా ఉబ్బరం, గ్యాస్, నిద్ర లేచిన తర్వాత బరువుగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. రాత్రి చేసిన భోజనంలో కొవ్వులు కరగడానికి వేడి నీళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. పేగులకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

Also Read : యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి గుంజి” కొడతారా..?

అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ప్రేగు కదలికలపై దాని ప్రభావం ఎక్కువ. జర్నల్ ఆఫ్ న్యూరోగ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ మోటిలిటీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, వెచ్చని ద్రవాలు పెరిస్టాల్సిస్‌ ను ప్రేరేపిస్తాయి. అంటే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారాన్ని కదిలించే కండరాల సంకోచాలు ప్రభావితం అవుతాయి. నీటి నుండి వచ్చే వేడి ధమనులు మరియు సిరలను విస్తరించడానికి సహాయపడుతుంది. ఎక్కువ వేడి లేకుండా నీళ్ళు తాగాల్సి ఉంటుంది. లేదంటే పొట్టలో గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

పోల్స్