Monday, August 10, 2026 01:01 PM
Monday, August 10, 2026 01:01 PM

బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్..!

సినీ రంగంలో బాబాయ్, అబ్బాయ్ మధ్య పోటీ ఆసక్తిగా ఉంటుంది. నందమూరి కుటుంబంలో బాబాయ్ నందమూరి బాలకృష్ణకు, అబ్బాయిలు తారక్ రామారావు, కల్యాణ్ రామ్ ఉన్నారు. దగ్గుబాటి కుటుంబం నుంచి విక్టరీ వెంకటేష్, రానా సినీ రంగంలో కొనసాగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, రామచరణ్ తేజ్, వరుణ్ తేజ్ బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బాబాయ్ – అబ్బాయి జోడీ ఒక్కసారి కూడా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడలేదు. నువ్వో నేనో తేల్చుకుందామని ఒక్కసారి ఏ ఇద్దరూ సై అనలేదు. ఒకరి సినిమా వస్తుందంటే.. మరొకరు వెనక్కి తగ్గారు కూడా. ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో అదే జరుగుతోంది. బాబాయ్ కోసం అబ్బాయి నెల రోజులు వెనక్కి వెళ్లాడు.

Also Read : ప్రియాంక రిక్వస్ట్ తో మహేష్, రాజమౌళి షాక్ అయ్యారా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా 2023లో మొదలైంది. అయితే పవన్ ఎన్నికల ప్రచారంలో హడావుడి కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలు రిలీజ్ చేసిన పాట పవన్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అంటూ దర్శకుడు హరీష్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఈ సినిమా రిలీజ్ డే‌ట్‌ను నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 26వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read : ఎన్టీఆర్ మార్కెట్ ను ప్రశాంత్ నిలబెడతాడా..?

పవన్ సినిమా కోసం అబ్బాయి రామ్ చరణ్ తేజ్ తన సినిమా పెద్ది వాయిదా వేసుకున్నారు. నిజానికి మార్చి 27వ తేదీన పెద్ది రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. చికిరి పాట చివర్లో సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఏప్రిల్ 30వ తేదీన పెద్ది రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దీంతో రెండు సినిమాల రిలీజ్ డేట్‌లను ఒకేసారి మైత్రీ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

స్థానిక పోరు.. రణమా.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఒంగోలు పాలిటిక్స్‌లో కూటమి...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

పోల్స్