Sunday, June 21, 2026 09:44 AM
Sunday, June 21, 2026 09:44 AM

ఇదేం కొట్టుడు.. టి20 వరల్డ్ కప్ లో భారత్ మిస్సైల్ అతనే..!

టి20 లు అంటేనే పరుగుల ప్రవాహం.. ఆ పరుగుల ప్రవాహానికి తుఫాన్ తోడైతే.. ఆ తుఫాన్ కు సునామీ తోడైతే..? అతనే టీం ఇండియా యంగ్ గన్ అభిషేక్ శర్మ. ఈ పాతికేళ్ళ కుర్రాడి దెబ్బకు టి20 రూపు రేఖలే మారిపోయాయి. ఒక మ్యాచ్ లో త్వరగా అవుట్ అయ్యాడని సంతోషపడే లోపే మరో మ్యాచ్ లో విశ్వ రూపం చూపిస్తున్నాడు. ఒకప్పుడు క్రిస్ గేల్, డివిలియర్స్, మెక్ కల్లం, గుప్తిల్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లను చూసిన అభిమానులకు ఈ నయా సంచలనం కొత్త రుచి చూపిస్తున్నాడు.

Also Read : పొలిటికల్ బ్యాక్ డ్రాప్.. బాలయ్య కోసం మలినేని ప్లాన్..!

బౌలర్ చేతి నుంచి బంతి జారితే చాలు.. డబుల్ స్పీడ్ తో స్టాండ్స్ లో ఉంటుంది. గత ఏడాది నుంచి భారత జట్టు టి20 విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పంజాబీ శర్మ గారి దెబ్బకు.. కివీస్ బౌలర్ లు బిక్కచచ్చిపోయారు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడా లేదు. బాదుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మనాడు బ్యాటింగ్ కు వస్తుంటేనే ప్రత్యర్ధులు భయపడే పరిస్థితి. పది ఓవర్లలో భారత్ 150 కి పైగా పరుగుల లక్ష్యాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా చేధించింది అంటే అందులో అభిషేక్ పాత్ర కీలకం.

Also Read : తర్వాతి కెప్టెన్ అతనే.. షైన్ అవుతున్న శర్మ..!

మొన్న ఇషాన్ కిషన్ ఆట తీరుతో షాక్ లో ఉన్న కివీస్ ఆటగాళ్లకు.. నిన్న అభిషేక్ శర్మ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపొయింది. అంతర్జాతీయ టి20 లలో అతని స్ట్రైక్ రేట్ 196 అంటే.. నిన్న అతని స్ట్రైక్ రేట్ 340 అంటే.. అతను ఏ రేంజ్ లో ఆడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు.. తక్కువ మ్యాచ్ లలో ఎక్కువ సిక్స్ లు ఇలా.. విశ్వరూపం చూపిస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ కు ముందు భారత్ కు ఫుల్ జోష్ ఇచ్చాడు. టీం ఇండియా బ్యాటింగ్ కు అతను ఖచ్చితంగా మిస్సైల్ అనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్