Sunday, March 22, 2026 07:44 AM
Sunday, March 22, 2026 07:44 AM

రాజధాని అమరావతిలో అట్టహాసం: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఆత్మవిశ్వాసం

గత దాదాపు పన్నెండు సంవత్సరాలుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది పూర్తిగా భిన్నమైన రూపంలో జరగబోతున్నాయి. తొలిసారిగా రాష్ట్ర రాజధాని అమరావతిలో, సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలోని విశాలమైన మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. దాదాపు 13,000 మంది పాల్గొనే ఈ వేడుకలను లక్షలాది మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారనే అంచనాలతో, మౌలిక వసతులు, రవాణా, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టారు.

Also Read : గోదారమ్మకు మూడవ సారి చంద్రబాబు పుష్కర హారతి..!

వేడుకల నిర్వహణలో భాగంగా పోలీసులు ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీల సమక్షంలో విస్తృత స్థాయి రిహార్సల్స్ నిర్వహించారు. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, అత్యవసర వైద్య సేవల కోసం వైద్య బృందాలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.

అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ వేడుకల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించటం మరో విశేషం. వారి కోసం ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడమే కాకుండా, రైతుల తరఫున ఒక ప్రతినిధిని ప్రధాన వేదికపైకి ఆహ్వానించి సత్కరించాలనే నిర్ణయం ప్రభుత్వ గౌరవభావాన్ని ప్రతిబింబిస్తోంది. అమరావతి అభివృద్ధిలో రైతుల త్యాగం కీలకమని, రాజధాని నిర్మాణం వారి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్న సందేశాన్ని ఈ చర్య స్పష్టంగా చాటుతోంది.

Also Read : పొలిటికల్ బ్యాక్ డ్రాప్.. బాలయ్య కోసం మలినేని ప్లాన్..!

గతంలో రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితి రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిన పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న దృఢమైన నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వంతో చేసిన సమన్వయం ఫలితంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తించే దిశగా కీలక ముందడుగు పడింది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే స్థాయికి ఈ ప్రక్రియ చేరడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. అమరావతిలో ఘనంగా నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఈ నగరం రాష్ట్ర భవిష్యత్తుకు కేంద్రబిందువుగా నిలవబోతుందన్న స్పష్టమైన సంకేతం. “దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలి” అన్న చంద్రబాబు నాయుడు సంకల్పానికి ఈ వేడుకలు ప్రతీకగా నిలుస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్