Thursday, May 7, 2026 02:12 AM
Thursday, May 7, 2026 02:12 AM

అమ్మో పవన్.. అధికారులలో గుండె దడ..!

తెలంగాణా సంగతి ఏమో గాని ఏపీలో మాత్రం అధికారులు ప్రభుత్వ పెద్దల మాట, ప్రజా ప్రతినిధుల మాట వినడం లేదనేది మనం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సర్కార్ పై కోపం ప్రదర్శించి 2019 నుంచి 2024 వరకు భజనలకు అలవాటు పడి.. పాలనను గాలికి వదిలేసారు అధికారులు. ఇక 2024 నుంచి పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ.. అధికారులను లైన్ లో పెట్టాలని సర్కార్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయినా సరే అధికారుల వైఖరిలో మార్పు లేదు.

Also Read : విజయ్ ను సిబిఐ ఏం అడిగింది..?

సిఎం, డిప్యూటి సిఎం మాటకు కొంత విలువ ఇస్తే.. మంత్రులు, ప్రజా ప్రతినిధులను అసలు పట్టించుకోవడం లేదనే మాట గట్టిగా వినపడుతోంది. అందుకే ఇప్పుడు సిఎం, డిప్యూటి సిఎం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు అధికారులు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఇటీవల పిఠాపురం వెళ్ళిన పవన్ కళ్యాణ్.. స్థానిక అధికారులతో పాటుగా తాను చూస్తున్న శాఖల అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పవన్ లో ఆగ్రహం కనపడుతోంది.

Also Read : ట్రాఫిక్ చలానాలపై కఠినత్వం.. రేవంత్ పై విమర్శల వెల్లువ

ఐఏఎస్ అధికారుల మాటను క్షేత్ర స్థాయిలో లెక్క చేయడం లేదనే సమాచారం కూడా పవన్ తెప్పించుకున్నారు అనేది ఇప్పుడు పంచాయితీ రాజ్, అటవీ శాఖలో ఎక్కువగా వినపడుతోంది. అక్రమాలపై కూడా పవన్ వద్ద కీలక సమాచారం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ నిఘా పెట్టి.. వారిని కంట్రోల్ చేసేందుకు రెడీ అయ్యారు. కొందరిని తన కార్యాలయానికి ఆదేశాలు కూడా ఇచ్చారు డిప్యూటి సిఎం. అర్జీలు తీసుకోని అధికారులకు ఇప్పటికే పవన్ నుంచి చర్యలు ఉంటాయనే సిగ్నల్ వెళ్ళింది. అటవీ శాఖలో అక్రమాలకూ పాల్పడే వారికీ బదిలీలు కూడా సిద్దం చేసారు డిప్యూటి సిఎం. అందుకే ఇప్పుడు పవన్ మాట వింటే అధికారులు పరుగులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్