Sunday, June 21, 2026 06:21 AM
Sunday, June 21, 2026 06:21 AM

బంగ్లా క్రికెట్ బోర్డు సముద్రం మీద అలుగుతోందా..?

గత రెండు నెలల నుంచి బంగ్లాదేశ్ లో జరుగుతోన్న అల్లర్లు భారతీయులను కాస్త కలవరపెట్టిన మాట వాస్తవమే. ఇదే సమయంలో భారత వ్యతిరేక ఉద్యమం కూడా అక్కడ జరుగుతోంది. హిందువులను ఇబ్బంది పెడుతోన్న విషయం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభావం క్రికెట్ పై గట్టిగా పడే అవకాశాలు కనపడుతున్నాయి. పాకిస్తాన్ తో విభేదాల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ ను నిలిపివేయడంతో పాటుగా ఐపిఎల్ లో పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా కొనుగోలు చేయడం లేదు. ఐపిఎల్ ప్రసారాలు కూడా పాక్ లో నిలిపివేశారు.

Also Read : త్వరలో భారత్ కు ట్రంప్ మరో షాక్..!

ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను ఐపిఎల్ నుంచి కేకేఆర్ రిలీజ్ చేసిన తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే కారణంతో.. ఐపిఎల్ ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక ఐపిఎల్ కు తమ ఆటగాళ్లను పంపకూడదు అని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాగే టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి షిఫ్ట్ చేయాలని, తమ ఆటగాళ్లకు భారత్ లో భద్రత లేదని డిమాండ్ చేసింది.

Also Read : వాళ్లకు మళ్ళీ నిరాశే.. ఇదేం సెలెక్షన్ అగార్కర్..?

ఒకవేళ ఈ అంశాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుని.. బంగ్లాదేశ్ తో క్రికెట్ ను నిలిపివేస్తే ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్ళు కూడా ఐపిఎల్ లో వచ్చే ఆదాయం కోల్పోతారు. భారత్ మ్యాచ్ లకు బంగ్లాదేశ్ లో ఆదరణ ఉంటుంది. అందుకే భారత్ తో సీరీస్ ఆడే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ కఠినంగా ముందుకు వెళ్తే మాత్రం.. అది సీరియస్ గా తీసుకుని మన బోర్డు అడుగులు వేస్తే.. బంగ్లా క్రికెట్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. చివరిగా సముద్రం మీద అలిగిన సామెత వర్తిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్